దేశీయ మార్కెట్లోకి పజేరొ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ ను విడుదల చేయనున్న మిత్సుబిషి
మిత్సుబిషి వారు ఇది వరకే దేశీయ మార్కెట్లో తమ పజేరొ ఎస్‌యువి వాహనాన్ని అందించారు. అయితే అతి త్వరలో దేశీయంగా పజేరొ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేయనున్నారు.

మిత్సుబిషి పజేరొ ఫోటోలు:
మిత్సుబిషి వారి పజేరొ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యువి లో 2.5-లీటర్ గల డీజల్ ఇంజన్ ఇందులో రానుంది. ఈ ఇంజన్ దాదాపుగా 178 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేయగలదు. అయితే మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల పజేరొ స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ దాదాపుగా 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును.
పజేరొ లోని ఆటోమేటిక్ వేరియంట్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది. దీనికి తోడు పెడల్ షిఫ్టర్స్‌ను కూడా అందించారు. మిత్సుబిషి మోటార్స్ వారు ప్రస్తుతం ఈ స్పోర్ట్ పజేరొ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యువి ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో లభించనుంది.
అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్ పజేరొ లో ఎటువంటి ఇంటీరియర్ మార్పులు చేటు చేసుకోలేదు మరియు ఇది స్వల్ప ఎక్ట్సీరియర్ మార్పులతో రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications




























