ఎక్స్ఎమ్ కాన్సెప్ట్ ఆవిష్కరించిన మిత్సుబిషి

By Anil
  • ఎక్స్ఎమ్ కాన్సెప్ట్‌ ఎమ్‌పివి తో ముందుకు వస్తోన్న మిత్సుబిషి.
  • 2017 అక్టోబర్ నాటికి ఇండోనేషియా మార్కెట్లోకి.
  • దేశీయంగా ఉన్న ఎర్టిగా, బిఆర్-వి మరియు జైలో వంటి వాటికి పోటీగా నిలవనున్న ఎక్స్ఎమ్ వాహనం.
మిత్సుబిషి నుండి ఎక్స్ఎమ్ ఎమ్‌పివి
జపాన్‌కు చెందిన హెవీ ఇండస్ట్రీస్ సంస్థ మిత్సుబిషి మోటార్స్ తమ అప్ కమింగ్ ఎమ్‌పివి వాహనానికి సంభందించిన టీజర్ ఇమేజ్‌ను విడుదల చేశారు. అయితే మిత్సుబిషి అధికారికంగా తమ ఎక్స్ఎమ్ కాన్సెప్ట్‌కు సంభందించిన అధికారిక ఫోటోలను విడుదల చేసింది. ఎక్స్‌మ్‌లో ఎక్స్ అనగా క్రాసోవర్ అధే విధంగా ఎమ్ అనగా మల్టీ పర్పస్ వెహికల్ అని తెలిపారు.
ప్రతి భారతీయుని స్థోమతకు సరితూగే ఐదు డీజల్ కార్లు
మిత్సుబిషి సంస్థ తమ ఎక్స్ఎమ్ కాన్సెప్ట్ ను అంతర్జాతీయ ప్రదర్శనకు సిద్దం చేస్తోంది. 2016 లో జరగనున్న గైకిండో ఇండోనేషియా అంతర్జాతీయ ఆటో షోలో దీనిని ప్రదర్శించింది. ఈ ఎక్స్ఎమ్ ను 2017 అక్టోబర్ నాటికి ఇండోషియా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. మిత్సుబిషి వారి ఎక్స్ఎమ్ ఎమ్‌పివి అందుబాటులోకి వస్తే హోండా బిఆర్-వి కి పోటీగా నిలవనుంది.
8 ఏళ్లలో 34 అవార్డులు 10 లక్షల అమ్మకాలు సాధించిన ఐ20
మిత్సుబిషి ఈ ఎక్స్ఎమ్ ఎమ్‌పివి కి సంభందించిన ఇంటీరియర్ వివరాలను వెల్లడించలేదు. అయితే దీనిని 7-సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా డిజైన్ చేస్తున్నారు.

సాంకేతికంగా ఇందులో అందిస్తున్న ఇంజన్ వివరాలను ప్రకటించలేదు, అయితే ఈ ఎక్స్ఎమ్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో విడుదల కానుంది. ఈ రెండు ఇంజన్‌లకు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను అనుసంధానం చేయనున్నారు.
18 ఏళ్ల తర్వాత మారుతి జిమ్నీ మళ్లీ మనముందుకు
దేశీయంగా పెద్దగా అమ్మకాలను ఆర్జించలేకపోయిన మిత్సుబిషి తమ ఎక్స్ఎమ్ ఎమ్‌పివి తో మంచి అమ్మకాలను సాధించేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఎమ్‌పివి సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా, హోండా బిఆర్-వి మరియు మహీంద్రా అండ్ మహీంద్రా వారి జైలో వంటి వాహనాలకు పోటీగా ఇది నిలువనుంది.
Also Read: సర్వే: 2016లో ఇండియాలో ఉన్న అత్యంత విశ్వసనీయమైన కార్లు

More from DriveSpark

Article Published On: Tuesday, August 9, 2016, 12:22 [IST]
English summary
Mitsubishi Unveils The XM Concept; Could Launch In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+