హ్యాండ్ క్రాఫ్టెడ్ మహీంద్రా బొలెరో: అందగా ఉందో లేదో మీరే చూడండి
ఇండియాలో కార్ల ప్రేమికుల పెరుగుదలతో పాటు కార్లను మోడిఫై చేసే వారు పెరిగారు. మోడిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే అస్సలు నచ్చని కారును కూడా మోడిఫికేషన్‌తో దానిని కోనుగోలయ్యే విధంగా చేస్తారు.
మోడిఫికేషన్స్ పాశ్చాత్య దేశాల్లో మొదలైనప్పటికీ మెల్లగా ఇది ఇండియాకు కూడా పాకింది. కాని ఇండియాలో మోడిఫికేషన్ అనేది తారా స్థాయికి చేరింది. ఒకప్పటి కాంటెస్సా మరియు జిప్సీల నుండి నేడు అందుబాటులో ఉన్న అనేక కార్లు విభిన్న డిజైన్లలో మోడిఫై అవుతున్నాయి.
గిజ్లీ (Gizzly)అనే మోడిఫికేషన్ సంస్థ ఒక బొలెరోని మోడిఫై చేసింది, దీని మొత్తం రీ డిజైన్‌ను చూశారంటే ఖచ్చితంగా మీకు కూడా ఇలాంటిది ఒకటి ఉంటే బాగుండు లేదా ఉన్న దానిని ఇలాగే మోడిఫై చేయించుకోవాలని కోరుకుంటారు.

మహీంద్రా వారు బొలెరోలో అందించిన ఇంటీరియర్‌ను పూర్తి స్థాయిలో మోడిఫై చేసారు సీట్లు, స్టీరింగ్ వీల్, ఫ్రంట్ డ్యాష్ బోర్డ్ , అప్ హోల్‌స్ట్రే వంటి అనేక ఇంటీరియర్ భాగాలకు కాస్తంత ఆరేంజ్ రంగు జోడిపుతో మోడిఫై చేసారు.

చుట్టు ప్రక్కల వెడల్పుగా ఉండేట్లు టైర్ల దగ్గర క్యాబిన్‍కు ఎమ్‌ఎస్ ఐరన్ క్లాడింగ్‌ను అందించారు. దీని మీద పౌడర్ కోటింగ్ చేశారు.

లైటింగ్ సిస్టమ్
మోడిఫికేషన్‌లో లైటింగ్ సిస్టమ్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. అందుకోసం ఇందులో....
పగటి పూట వెలిగే లైట్లు,
బంపర్‌లో 3డి ఎల్‌ఇడి లైట్లు,
రూఫ్ టాప్ మీద సిరీస్ లైట్లు,

- ముందు వైపు వరకు పొడగించిన క్లాడింగ్ మీద లైట్లు,
- వెనుక బంపర్ మీద రిఫ్లెక్టర్ మరియు రివర్స్ లైట్లు,
- సైడ్ రిఫ్లెక్టర్స్,
- ఇండికేటర్ల స్థానంలో రెక్కల రూపంలో ఉండే ఎల్‌ఇడి లైట్లు, మరియు
- ఎల్‌ఇడి వ్రాంగ్లర్ టెయిల్ లైట్లతో అలంకరించారు.
- దిలీప్ ఛాబ్రియా ! ఏంటి నీ సృష్టి

ముందు వైపు బ్యానెట్ మీద ఎల్ఇడి లైటు మరియు కస్టమైజ్ చేసిన సంస్థ యొక్క లోగోను అందించారు.

ఇరువైపులా వ్లాంగ్లర్ జీపు యొక్క ప్రక్కటద్దాలను మరియు సైడ్ విసర్స్‌ను అందించారు

31-అంగుళాల చక్రాలకు సరిపోయే విధంగా సస్పెన్షన్‌ను అందించారు.

బాడీ మొత్తం మెటాలిక్ పెయింట్ జాబ్ చేసారు.

ఫ్లోర్ ల్యామినేషన్‌తో పాటు కస్టమ్ డ్యూయల్ టోన్ అప్‌హోల్‌స్ట్రేను అందించారు.

సస్పెన్‌డెడ్ ట్రాక్ గల పియు రూఫ్ లైనింగ్ మరియు ఎల్‌ఇడి లైట్లు ఉన్నాయి.

రూఫ్ మౌంటెడ్ సన్ గ్లాస్ హోల్డర్ అదే విధంగా మిర్రర్‌ను డిజైన్ చేశారు.

డ్యాష్ బోర్డ్‌ను డ్యూయల్ టోన్ రంగులతో అలంకరించారు.

ఎంటర్‌టైన్‌మెంట్ కోసం డ్యాష్ బోర్డులో డివిడి ప్లేయర్, స్పీకర్లు, ఆంప్లిఫైయర్, హెడ్ రెస్ట్ వెనుక స్క్రీన్, రియర్ వ్యూవ్ సెన్సార్లు మరియు పూర్తి కాలం రివయర్ వ్యూవ్ మిర్రర్‌ను అందించారు.

అయితే ముందువైపున మోడిఫికేషన్ సంస్థ యొక్క లోగో చివరిలో "S" కలిపి ఉంటే బాగుండేది.

హ్యాండ్ క్రాఫ్టెడ్ మహీంద్రా బొలెరోలోని సీట్లు

హ్యాండ్ క్రాఫ్టెడ్ మహీంద్రా బొలెరోలోని డోర్ లోపలి వైపు

హ్యాండ్ క్రాఫ్టెడ్ మహీంద్రా బొలెరో ఫోటోలు....

హ్యాండ్ క్రాఫ్టెడ్ మహీంద్రా బొలెరో రివయర్ వ్యూవ్

ఫన్నీ కార్ మోడిఫికేషన్స్...
ఇలాంటి కార్లను ఎక్కడైనా చూశారా?



Click it and Unblock the Notifications








