లిమోసిన్‌గా మారిపోయిన టయోటా ఫార్చ్యూనర్

డిసి డిజైన్స్ టయోటా ఫార్చ్యూనర్ వాహనాన్ని పూర్తిగా లిమోసిన్ స్టైల్లో మోడిఫై చేశారు.

By Anil

టయోటా మోటార్స్ వారి ఫార్చ్యూనర్ ఎస్‌యువి భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ ప్రీమియమ్ ఎస్‌యువిగా విక్రయాల్లో మొదటి స్థానంలో నిలిచింది. జపాన్‌కు చెందిన టయోటా ఈ మధ్యనే తమ ఫార్చ్యూనర్ ఎస్‌యువిని ఫోర్డ్ ఎండీవర్‌కు పోటీగా అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేసింది.

మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

డిసి డిజైన్స్, దేశీయంగా ఏ కారు విడుదలయినా మోడిఫికేషన్‌ చేయడంలో ఏ మాత్రం ఆలస్యం చెయ్యదు. మార్కెట్లోకి వచ్చే ప్రతి వాహనానికి డిసి తమదైన రీతిలో మోడిఫికేషన్స్ నిర్వహిస్తుంది.

మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

అయితే డిసి చేసిన ఈ మోడిఫికేషన్ మీరు అస్సలు ఊహించనిది. సాధారణ ఫార్చ్యూనర్ వాహనాన్ని లిమోసిన్ తరహాలో అత్యంత పొడవుగా, విలాసవంతమైన క్యాబిన్‌ను లగ్జరీ హంగులతో మోఢిఫికేషన్ చేసింది.

మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

పూర్తి స్థాయిలో ఫారిన్ లిమోసిన్ ఆకారంలో డిసి డిజైన్స్ రూపొందించిన ఈ వాహనాన్ని టయోటా వారి ఫార్చ్యూనర్ ప్రీమియమ్ ఎస్‌యువి అని గుర్చించవచ్చు.

మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

ఫార్చ్యూనర్ వాహనాన్ని లిమోసిన్ తరహాలో డిజైన్ చేయడానికి డిసి డిజైన్స్ వారికి సుమారుగా మూడు నెలల సమయం పట్టిందట. దీనిని గౌహతిలో మోడిఫై చేసినట్లు డిసి వెల్లడించింది.

మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

కేవలం మోడిఫికేషన్‌కు మాత్రమే 40 లక్షల రుపాయలు ఖర్చయినట్లు తెలిసింది. ఫార్చ్యూనర్ లోని ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను సేకరించి ఈ తరహాలో డిసి డిజైన్ మోడిఫై చేసింది. ప్రస్తుతం దీని విలువ 70 లక్షలుగా ఉంది.

మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

డిసి డిజైన్స్ చేతిలో మళ్లీ ప్రాణం ఊపిరిపోసుకున్న ఈ ఫార్చ్యూనర్ ముందు భాగంలో డిజైన్ పరంగా చాలా మార్పులు సంతరించుకున్నాయి. ప్రొజెక్టర్ లైట్లు గల సిగ్నేచర్ హెడ్ ల్యాంప్స్, బ్యానెట్ మీద రెండు నిలువు గీతలతో పాటు ఒరిజినల్ హుడ్ స్కూప్ అలానే వచ్చింది.

మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

హెక్సా గోనల్ గ్రిల్ మెష్ మరియు ఇందులోని ఫార్చ్యూనర్ సాధారణ బ్యాడ్జింగ్ స్థానంలో ఎఫ్1 బ్యాడ్జిని అందించింది. మరియు భారీ కాయంతో ఉన్న మోడిఫైడ్ ఫార్చ్యూనర్ ముందు వైపున అగ్రెసివ్ బంపర్‍‌ను గమనించగలరు.

మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

ఇందులో చోటు చేసుకున్న మార్పులను సైడ్ ప్రొఫైల్ ద్వారా స్పష్టంగా గమనించవచ్చు. పొడగించబడిన వీల్ బేస్ ఇది ఎస్‌యువి కాకుండా లిమోసిన్ అని పిలిపించుకునేలా చేసింది. ఇక టాప్ మీద రూఫ్ రెయిల్స్ ఇవ్వకపోవడం వలన చివర్లో స్పాయిలర్‌‌ను తగిలించారు.

మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

లిమోసిన్ ఫార్చ్యూనర్‌కు వెనుక వైపున కూడా భారీ హంగులు అద్దింది డిసి డిజైన్స్. రీ డిజైన్ చేయబడిన టెయిల్ లైట్లు, ఇరువైపులా సింగల్ ఎగ్జాస్ట్ పైపులు, దీనిని ఇంతలా పొడిగించడానికి గల కారణం ఇంటీరియర్ సౌలభ్యం కోసం అని తెలుస్తోంది.

మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

ఇంత పొడవుగా ఉన్న ఈ మోడిఫైడ్ పార్చ్యూనర్‌లో ఎంత మంది కూర్చోగలరో తెలుసా....? కేవలం నలుగురు మాత్రమే. అయితే దీనిని లిమోసిన్ ట్యాగ్ లైన్‌కు తగ్గట్లుగానే భారీ ఫీచర్లతో మోడిఫై చేశారు.

మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

ఇంటీరియర్‌లో బాగా గుర్తించదగిన ఫీచర్లలో టెలివిజన్, విభిన్న మార్గాల్లో సీట్లను అడ్జెస్ట్ చేసుకునే సీట్లు కలవు. మొదటి తరం ఫార్చ్యూనర్‌ వాహనాన్ని మోడిఫికేషన్‌ కోసం ఎంచుకున్నారు కాబట్టి ఇందులో 2.5-లీటర్ లేదా 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న కామన్ రెయిల్ టర్బో డీజల్ ఇంజన్ ఉండే అవకాశం కలదు.

మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

  • బాగా చూడండి ఇది మహీంద్రా వారి మోడిఫైడ్ XUV500
  • నాగ్ కోసం మోడిఫైడ్ టొయోటా ఫార్చ్యూనర్
  • డిసి డిజైన్స్ మోడిఫైడ్ టొయోటా ఇన్నోవా
  • మోడిఫైడ్ టయోటా ఫార్చ్యూనర్

    • ఆరు లక్షలకే బెంజ్ కారా ఇదెలా సాధ్యం
    • నిస్సాన్ జిటి-ఆర్ రూపంలో మారుతి సుజుకి స్విఫ్ట్

More from DriveSpark

Article Published On: Monday, December 19, 2016, 12:53 [IST]
English summary
This Modified Toyota Fortuner Has Been Stretched To Its Limits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+