మార్చిలో విడుదల కానున్న టాప్-5 కార్లు

By Anil

నూతన సంవత్సరం ప్రారంభం అయ్యి రెండు నెలల కాలం గడిచిపోయినా కూడా ఇంకా కొత్త వాహనాల విడుదల జోరు ఇంకా తగ్గలేదు. ఈ ఎడాదిలో రెండు మాసాలు కూడా అత్భుతమైన నూతన మోడల్స్ కు నిలయమయ్యాయి. అయితే మార్చి నెల కూడా ఇదే తరహాలో కొత్త కార్లను తన ఖాతాలో విడుదల చేయనుంది.

వచ్చే మార్చి మాసంలో దాదాపుగా ఐదు కొత్త కార్లు అమ్మకాలకు పూర్తిగా సిద్దం కానున్నాయి. మార్చి చివరికల్లా ఇండియాలో గల తమ షోరూమ్‌లకు అమ్మకాలకు సిద్దం కానున్నాయి. మరెందుకు ఆలస్యం మార్చిలో విడుదల కానున్న టాప్-5 కార్ల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

 1. టాటా టియాగొ

1. టాటా టియాగొ

టాటా కైట్ అనే కోడ్ పేరుతో వచ్చి జికా పేరుతో పరిచయం అయ్యి టియాగొ అనే పేరుతో విడుదల కానున్న దీనిని టాటా వారు మార్చి మధ్య భాగంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. టాటా వారు బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఈ టియాగొ మంచి ఫలితాలు సాధిస్తుందని తెలిపారు.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

టాటా మోటార్స్ ఈ టియాగొ కారును 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ డీజల్ ఇంజన్‌ల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ధర సుమారుగా రూ. నాలుగు లక్షల రుపాయలతో ప్రారంభం కానుంది. దీని విడుదల వివరాల కోసం డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

2. రెనో డస్టర్ ఆటోమేటిక్

2. రెనో డస్టర్ ఆటోమేటిక్

రెనో ఇండియా వారు విడుదల చేసిన మొదటి డస్టర్ ఎస్‌యువి కారు అతి తక్కువ కాలంలో విశేష ప్రజాదరణ పొందింది. అయితే రెనో ఈ డస్టర్‌ను ఫేస్‌లిఫ్ట్ అవతారంలో ఆటోమేటిక్ వర్షెన్ డస్టర్ కారును మార్చినెలలో మార్కెట్లోకి అమ్మకాలకు పూర్తి సిద్దంగా తయారు చేయనున్నారు.

మార్చిలో విడుదల కానున్న టాప్-5 కార్లు

రెనో ఇండియా తమ ఫేస్‌లిఫ్ట్ ఆటోమేటిక్ డస్టర్ ఎస్‌యువిలో ఆటోమేక్ ట్రాన్స్‌మిషన్ గల 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందివ్వనున్నారు. ఇది దాదాపుగా 108.50 బిహెచ్‌పి పవర్ మరియు 248 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇది విడుదల అయితే సాదారణ డస్టర్ కన్నా 25 వేల రుపాయల కన్నా అధిక ధరతో అందుబాటులోకి రానుంది.

3. హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్

3. హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్

హోండా మోటార్స్ వారి అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారు ఈ మధ్య అమ్మకాలలో సంస్థకు మొండి చేయి చూపించింది. అందుకోసం హోండా మోటార్స్ వారు తమ అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారు యొక్క ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ మార్పులతో మార్చిలో విడుదల చేయనున్నారు. అనగా హోండా అమేజ్ ద్వారా కొల్పోయిన అమ్మకాలను అమేజ్ ఫేస్ లిఫ్ట్ ద్వారా చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని మార్చి 3 వ తేదీన మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

మార్చిలో విడుదల కానున్న టాప్-5 కార్లు

హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. రెండు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటి గేర్ బాక్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

4. మహీంద్రా క్వాంటో ఫేస్‌లిఫ్ట్

4. మహీంద్రా క్వాంటో ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా అండ్ మహీంద్రా వారు తమ క్వాంటో ఫేస్‌లిఫ్ట్ కారును క్యాంటో పేరుతో మార్చి చివరినాటికి తమ షోరూమ్‌లకు చేర్చనున్నారు.

Picture credit: autocolumn

మార్చిలో విడుదల కానున్న టాప్-5 కార్లు

మహీంద్రా 2016 క్వాంటో ఫేస్‌లిఫ్ట్ వాహనంలో 1.3-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్‌ను తీసుకువస్తున్నారు. ఇది దాదాపుగా 84 బిహెచ్‌పి పవర్ మరియు 230 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును. ఈ ఇంజన్‌ ఆప్షనల్‌గా 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానుంది.

Picture credit: autocolumn

5. మారుతి సుజుకి వితాజా బ్రిజా

5. మారుతి సుజుకి వితాజా బ్రిజా

మారుతి సుజుకి ఈ నెల ప్రారంభంలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన వితాజా బ్రిజా ఎస్‌యువి వాహనాన్ని మార్చి 21 దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

మార్చిలో విడుదల కానున్న టాప్-5 కార్లు

1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ దాదాపుగా 90 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును. మరియు దీని ధర రూ. 6.5 నుండి 8.5 లక్షల మధ్య ఉండవచ్చు.

మరిన్ని కథనాలకు
  • ఇండియన్ మార్కెట్లోకి వరుసగా విడుదల కానున్న 20 కార్లు
  • నిన్న కాక మొన్న వచ్చింది, మారుతి సుజుకి డిజైర్‌ను పడగొట్టింది: ఇక్కడ చదవండి.

Most Read Articles

English summary
Most Expected Top 5 New Car Models In March
Story first published: Monday, February 29, 2016, 10:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X