కాంపాక్ట్ సెడాన్ కార్లను కొంటున్నారా ? అయితే అధిక మైలేజ్‌నిచ్చే ఈ ఐదింటిని పరిశీలించండి

By Anil

మైలేజ్ ఎంత ఇస్తోంది, ఇండియన్ మార్కెట్లో ప్రతి ఒక్క కస్టమర్ కూడా వాహనాలను కొనుగోలు చేసే ముందు అడిగే ప్రశ్న. సెడాన్ కార్లు ఇంటీరియర్ పరంగా ఎక్కువ విశాలంగాను మరియు అధిక లగేజ్‌ స్పేస్‌ను కూడా కలిగి ఉంటాయి. కాని కాంపాక్ట్ సెడాన్ కార్ల విషయానికి వస్తే ఎంతో ముఖ్యమైన మైలేజ్ అంశాన్ని త్యాగం చేసేస్తున్నారు.

ఎంతో కాలంగా కార్ల తయారీ సంస్థలు అందిస్తున్న తమ సెడాన్ కార్లు అధిక మైలేజ్‌ ఇవ్వడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అందులో మంచి మైలేజ్‌ ఇవ్వగల ఐదు ఉత్తమ ఇండియన్ కాంపాక్ట్ సెడాన్ కార్ల గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

5. టాటా జెస్ట్

5. టాటా జెస్ట్

టాటా మోటార్స్‌కు చెందిన జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ కారు ఈ విభాగంలో ఐదవ స్థానంలో నిలిచింది. టాటా మోటార్స్ ఇందులో 89 బిహెచ్‌పి పవర్ మరియు 140 ఎన్ఎమ్ ఉత్పత్తి చేయగల 1.2 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ అలాగే మొదటి స్టేజ్‌లో 74 బిహెచ్‌పి, రెండవ స్టేజ్‌లో 89 బిహెచ్‌పి పవర్‌తో పాటు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.3 లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌‌లను జెస్ట్‌లో అందించింది.

మైలేజ్, ధర మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

మైలేజ్, ధర మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

టాటా మోటార్స్ ఈ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో ఉన్న రెండు ఇంజన్‌లకు ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లు గల గేర్‌బాక్స్‌ను ఆప్షనల్‌గా అందించారు.

  • మైలేజ్: 23 కిమీ/లీ (డీజల్); 17.6 కిమీ/లీ (పెట్రోల్)
  • ధర: రూ. 5.96 లక్షలు
  • 4. హ్యుందాయ్ ఎక్సెంట్

    4. హ్యుందాయ్ ఎక్సెంట్

    హ్యుందాయ్ మోటార్స్ అందించిన ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కారు ఈ జాబితాలో నాలుగవ స్థానంలో ఉంది. హ్యుందాయ్ ఇందులో 81 బిహెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అదేవిధంగా 71 బిహెచ్‌పి పవర్ మరియు 180 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.1 లీటర్ డీజల్ ఇంజన్‌ను అందించింది.

    మైలేజ్, ధర మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

    మైలేజ్, ధర మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

    ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌ కారులో ఎంచుకోదగిన విధంగా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందుబాటులో ఉంచారు.

    • మైలేజ్: 24.4 కిమీ/లీ (డీజల్); 19.1 కిమీ/లీ (పెట్రోల్)
    • ధర: రూ. 6.24 లక్షలు
    • 3.హోండా అమేజ్

      3.హోండా అమేజ్

      హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి ఉత్తమ మైలేజ్ ఇవ్వగల ఉత్పత్తులను ఎప్పటిలాగే అందిస్తూ ఉంది. అందులో ఒకటి అమేజ్ కాంపాక్ట్ సెడాన్. ఇది పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అమేజ్‌లోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 87 బిహెచ్‌పి పవర్ మరియు 109 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే అమేజ్‌లోని 1.5 లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ 99 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

      మైలేజ్, ధర మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

      మైలేజ్, ధర మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

      హోండా మోటార్స్ ఈ అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లలో అందుబాటులో ఉంది.

      • మైలేజ్: 25.8 కిమీ/లీ (డీజల్); 17.8 కిమీ/లీ (పెట్రోల్)
      • ధర: రూ. 6.34 లక్షలు
      • 2. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్

        2. ఫోర్డ్ ఫిగో ఆస్పైర్

        ఫోర్డ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి అందించిన అత్భుతమైన కాంపాక్ట్ సెడాన్ కారు ఫిగో ఆస్పైర్. మంచి ఇంజన్ మరియు డిజైన్ ఆప్షన్‌తో మారుతి వారి డిజైర్‌ కారుతో పోటీ పడుతోంది. ఇందులో 87 బిహెచ్‌పి పవర్ మరియు 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌‌ను ఉత్పత్తి చేయగల 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 110 బిహెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.5 డీజల్ ఇంజన్ అలాగే 99 బిహెచ్‌పి పవర్ మరియు 215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగల 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌లు కలవు.

        మైలేజ్, ధర మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

        మైలేజ్, ధర మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

        మూడు ఇంజన్ ఆప్షన్లలో 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మరియు మిగిలిన ఇంజన్ ఆప్లన్లు గల వేరియంట్లు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి.

        • మైలేజ్: 25.8 కిమీ/లీ (డీజల్); 18.1 కిమీ/లీ (పెట్రోల్)
        • ధర: రూ. 6.33 లక్షలు
        • 1. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

          1. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

          ఇండియాలో గరిష్ట మైలేజ్ ఇవ్వగల మరియు గరిష్ట అమ్మకాలు సాధిస్తున్న ఉత్తమ కాంపాక్ట్ సెడాన్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్. డిజైర్ కారులో 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.3 లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. ఈ రెండు ఇంజన్‌లు కూడా వరుసగా 83 బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ మరియు 74 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

          మైలేజ్, ధర మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

          మైలేజ్, ధర మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు

          రెండు ఇంజన్ వేరియంట్లు కూడా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. ఈ రెండింటిని ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో కూడా ఆప్షనల్‌గా అందుబాటులో ఉంచారు.

          • మైలేజ్: 26.5 కిమీ/లీ (డీజల్); 20.8 కిమీ/లీ (పెట్రోల్)
          • ధర: రూ. 6.18 లక్షలు
          • ఎక్కువ మైలేజ్ ఇవ్వగల 5 కాంపాక్ట్ సెడాన్ కార్లు

            ఈ కథనంలో తెలిపిన ధరలు ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ మరియు అన్ని ధరలు కూడా ఆయా మోడల్ యొక్క ఎంట్రీలెవల్ కార్ల ధరలుగా ఉన్నాయి. మరియు ఈ కథనంలో తెలిపిన మైలేజ్ వివరాలు ఏఆర్‌ఏఐ ప్రకారం ఉన్నాయి. ఈ కథనం గురించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు.

            ఎక్కువ మంది చదివిన కథనాల మీ కోసం...

            గేర్లు ఎప్పుడు, ఎలా మార్చాలి ?

            సముద్రంలో ఉన్న భయంకరమైన దెయ్యం నౌకలు... !!

Article Published On: Wednesday, June 1, 2016, 14:51 [IST]
English summary
Top 5 Most Fuel Efficient Compact Sedans In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+