ఇండియాలో ఉన్న ప్రముఖ కార్ల కు నిర్వహంచిన క్రాష్ పరీక్షలు, వాటి రేటింగ్
ఇండియన్ మార్కెట్లోకి ప్రతి ఏడాది కూడా ప్రతి కార్ల తయారీ సంస్థ కొన్ని కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉన్నాయి. అధిక అమ్మకాలు చవిచూడటానికి డిజైన్, ఫీచర్లు, ధర వంటి అనేక అంశాలను చూపించి భద్రత వివరాలను దాచేసి తమ కార్ల అమ్మకాలను సాగిస్తూనే ఉన్నాయి. భద్రత ప్రమాణాలు లేని కార్లను యథావిధిగా వినియోగదారులు కొంటూనే ఉన్నారు. అయితే చాలా మంది భద్రత అనే అంశం మీద కనీస అవగాహన కూడా లేదు.
ఇండియన్ మార్కెట్లో బాగా అమ్ముడుపోతున్న కొన్ని ప్రముఖ కార్లకు గ్లోబల్ ఎన్‌సిఎపి భద్రత పరీక్షలు నిర్వహించింది. అందులో ఏ కారు ఏ విధమైన ర్యాంకింగ్ ఉందో, అవి ఎంత వరకు సురక్షితమో అనే వివరాలను క్రింది కథనంలో అందిస్తున్నాము.

హ్యుందాయ్ ఇయాన్
హ్యుందాయ్ వారి ఇయాన్ కారు పెద్దల భద్రత పరంగా జీరో రేటింగ్‌కు పరిమితం కాగా, పిల్లల భద్రత పరంగా 49.0 కు గాను 20.42 పాయింట్లతో 2 స్టార్ రేటింగ్‌ను పొందింది.

హ్యుందాయ్ ఐ10
హ్యుందాయ్ వారి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు ఐ10 ఎయిర్ బ్యాగులు లేనిది పెద్దల భద్రత పరంగా జీరో రేటింగ్‌ను పొందింది. అదేవిధంగా పిల్లల భద్రత విషయంలో 1 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది.

హ్యుందాయ్ ఐ20
మంచి అమ్మకాలు సాధిస్తున్న ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఐ20 ఒకటి. భద్రత పరంగా ఇది ఉత్తమ ఫలతాలను సాధించింది. పెద్దల భద్రత పరంగా 4 స్టార్ రేటింగ్ మరియు చిన్న పిల్లల భద్రత పరంగా 3 స్టార్ రేటింగ్‌ను పొందిందింది.

మారుతి సుజుకి ఇఎకో
ఎయిర్ బ్యాగులు లేని మారుతి వారి ఎమ్‌పివి కారు ఇఎకో పెద్దల భద్రత పరంగా జీరో రేటింగ్‌ను మరియు పిల్లల భద్రత పరంగా 2 స్టార్ రేటింగ్‌ను పొందింది.

సెలెరియో
ఎయిర్ బ్యాగున్న సెలెరియో కారు పెద్దల భద్రత పరంగా జీరో రేటింగ్ మరియు పిల్లల భద్రత విషయంలో 1 స్టార్ రేటింగ్ పొందింది.

మారుతి సుజుకి స్విఫ్ట్
భారత దేశపు ఉత్తమ సెల్లింగ్ కారు స్విఫ్ట్‌కు గ్లోబల్ ఎన్‌సిఎపి పెద్దల భద్రత పరంగా నిర్వహించిన పరీక్షల్లో జీరో రేటింగ్‌ను పొందింది. మరియు పిల్లల భద్రత విషయంలో స్విఫ్ట్ 1 స్టార్ రేటింగ్‌ను పొందింది.

మారుతి సుజుకి ఆల్టో
మారుతి సుజుకి వారి ఆల్టో దేశీయంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న ఏకైక ఉత్పత్తి. ఆల్టో లోని ఎయిర్ బ్యాగులు లేని కె10 మోడల్‌కు నిర్వహించిన భద్రత పరీక్షల్లో పెద్దల భద్రత పరంగా సున్నా మరియు పిల్లల భద్రత పరంగా 2 స్టార్ రేటింగ్‌ను పొందింది.

మారుతి సుజుకి బాలెనొ
మారుతి సుజుకి గత ఏడాదిలో తమ బాలెనొ కారుతో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. రెండు ఎయిర్ బ్యాగులు ఉన్న బాలెనొకు నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో పెద్దల మరియు పిల్లల భద్రత పరంగా వరుసగా 4 మరియు 3 స్టార్ల భద్రత రేటింగ్‌ను పొందాయి. ఎయిర్ బ్యాగులు లేని బాలెనొకు నిర్వహించిన భద్రత పరీక్షల్లో పెద్దల భద్రత పరంగా 3 మరియు పిల్లల భద్రత పరంగా 3 స్టార్ల రేటింగ్‌ను పొందింది

మహీంద్రా స్కార్పియో
మహీంద్రా వారి స్కార్పియోను ఎయిర్ బ్యాగులు లేకుండా క్రాష్ పరీక్షలు నిర్వహించారు. ఇది పెద్దల భద్రత పరంగా జీరో మరియు పిల్లల భద్రత పరంగా 2 స్టార్ రేటింగ్‌ను పొందింది.

రెనో క్విడ్ - 1
రెనోకు చెందిన క్విడ్‌లోని మూడు వేరియంట్లను ఎంపిక చేసుకుని భద్రత పరీక్షలు నిర్వహించారు. అందులో ఎయిర్ బ్యాగు లేని మోడల్‌కు నిర్వహించగా పెద్దల భద్రత విషయంలో జీరో మరియు పిల్లల భద్రత విషయంలో 2 స్టార్ రేటింగ్‌ను పొందింది.

రెనో క్విడ్ - 2
రెండవ మోడల్‌గా ఎంచుకున్న ఉత్తమ రీఇన్‌ఫోర్స్‌మెంట్ గల క్విడ్‌కు నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో పెద్దలు మరియు పిల్లల భద్రత విషయాల్లో పాయింట్ల పరంగా కొంచెం ఫర్వాలేదనిపించినా ఎటుంటి రేటింగ్‌లను పొందలేకపోయింది.

రెనో క్విడ్ - 3
క్విడ్‌లోని మూడవ మోడల్‌గా ఎంపిక చేసుకున్న ఎయిర్ బ్యాగ్ ఉన్న క్విడ్ కారుకు నిర్వహించిన భద్రత పరీక్షల్లో పిల్లల భద్రత పరంగా పాయింట్ల పరంగా బాగున్నప్పటికీ రేటింగ్ రాలేదు, ఇక మిగిలిన అన్ని విషయాలలో మూడు క్విడ్‌లు ఒకటే.

టయోటా ఎటియోస్ లివా
రెండు ఎయిర్ బ్యాగులున్న టయోటా ఎటియోస్ లివా కారు పెద్దల భద్రత పరంగా నాలుగు మరియు పిల్లల భద్రత పరంగా రెండు స్టార్ల భద్రత రేటింగ్‌ను పొందింది. పెద్దల భద్రత పరంగా స్విఫ్ట్‌తో పోల్చుకుంటే ఎటియోస్ లివా ఉత్తమం అనిపిస్తుంది.

ఫోర్డ్ ఫిగో
ఎయిర్ బ్యాగులు లేని పోర్డ్ ఫిగో కారుకు నిర్వహించిన భద్రత పరీక్షల్లో ఇది పెద్దల భద్రత పరంగా జీరో రేటింగ్‌ను పొందింది. అయినప్పటికీ దీని పోటీదారులతో పోల్చుకుంటే ఉత్తమ పాయింట్లను పొందింది. పిల్లల భద్రత విషయంలో 2 స్టార్ రేటింగ్‌ను పొందింది. (2014 లో దీనికి భద్రత పరీక్షలు నిర్వహించారు).

ఫోర్డ్ ఎకోస్పోర్ట్
ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఎస్‌యువిని రెండు ఎయిర్ బ్యాగులతో 2013కు ముందు క్రాష్ పరీక్షలు నిర్వహించారు. అందులో పెద్దల భద్రత పరంగా నాలుగు మరియు పిల్లల భద్రత పరంగా మూడు స్టార్ల రేటింగ్‌ను పొందింది.

వోక్స్‌వ్యాగన్ పోలో
వోక్స్‌వ్యాగన్ వారి ఎయిర్ బ్యాగులు లేని పోలో కారుకు నిర్వహించిన పరీక్షల్లో పెద్దల భద్రత పరంగా జీరో మరియు పిల్లల భద్రత పరంగా మూడు స్టార్ల రేటింగ్‌ను పొందింది. అదే విధంగా డ్యూయల్ ఎయిర్ బ్యాగులున్న పోలో కారుకు నిర్వహించిన భద్రత పరీక్షల్లో పెద్దల పరంగా 4 మరియు పిల్లల భద్రత పరంగా మూడు స్టార్ల రేటింగ్‌ను పొందింది.

టాటా నానో
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చౌకైన కారు టాటా నానోకు నిర్వహించిన భద్రత పరీక్షల్లో పెద్దలు మరియు పిల్లలకు సంభందించి జీరో రేటింగ్‌ను పొందింది.

డాట్సన్ గో
ఎయిర్ బ్యాగులు లేని డాట్సన్ గో కారుకు నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో పెద్దల భద్రత పరంగా జీరో మరియు పిల్లల భద్రత పరంగా 2 స్టార్ రేటింగ్‌ను పొందింది. ఎయిర్‌బ్యాగులున్న గో కారుకు పరీక్షలు నిర్వహించడానికి ఇందులో ఎయిర్ బ్యాగులు అందివ్వలేదు.

చివరి మాట
చాలా దేశాలలో భద్రతకు సంభందించిన ఫీచర్లను తప్పనిసరి చేశారు. కాని ఇండియాలో ఆ పద్దతి అమలు కాలేదు. 2017 తరువాత అందుబాటులోకి వచ్చే ప్రతి కారులో కూడా రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి వాటిని తప్పనిసరి చేయనున్నారు. వినియోగదారులు కూడా కార్లను కొనే ముందు భద్రత ఫీచర్లున్న వాటిని ఎంచుకోవడం ఎంతో ఉత్తమం.

రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!
20 వేల టియాగో బుకింగ్‌లు: ఈ విజయం వెనకున్న ముఖ్య కారణాలు


Click it and Unblock the Notifications








