న్యూ జనరేషన్ స్విఫ్ట్ : ఫోటోలు మరియు వివరాలు
దేశీయ కార్ల మార్కెట్లో తిరుగులేని సంస్థ మారుతి సుజుకి అని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను ప్రవేశపెడుతూనే భారీ స్థాయిలో అమ్మకాలు నమోదు చేసుకుంటూ దేశీయ వాహనం రంగంలో తనకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకుంది.
ఇప్పటికే కొన్ని కొత్త మోడల్స్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయాలనే అలోచనలో మారుతి సుజుకి ఉంది. అయితే వీటికి తోడుగా స్విఫ్ట్ న్యూ జనరేషన్ కారును తీసుకురానుంది. దీనికి చెందిన ఫోటోలు మరియు ఇతర వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మారుతి సుజుకి ఈ న్యూ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును దాదాపుగా స్విఫ్ట్ రూపంలోనే ఉంటుంది. అయితే ముందు వైపు డిజైన్ లో భాగమైన హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ గ్రిల్, ఎయిర్ ఇంటేకర్ మరియు ఫాగ్ ల్యాంప్స్ వాటిని చాలా వరకు కొత్త డిజైన్‌లో అందిస్తోంది.

ఇందులో సి-పిల్లర్స్ మరియు ప్లోటింగ్ రూఫ్ డార్క్ కలర్‌లో ఉంది. మరియు దీని డర్ హ్యాండిల్స్‌ను విండో యొక్క మూలలో అందించారు.

ముందు మరియు వెనుక వైపున ఆకర్షణీయంగా టెయిల్ లైట్లను అందించారు. వెనుక వైపున గల టెయిల్ ల్యాంప్స్‌ను మరింత ఆకర్షణీయంగా డిజైన్ చేశారు.

ఇంటీరియర్ ఫీచర్ల పరంగా సరికొత్త డిజైన్‌తో వచ్చిన స్టీరింగ్ వీల్, మరియు రెండు సెట్ల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, దీనిలో కారు యొక్క హీటింగ్ వెంటిలేషన్ మరియు ఎ/సి కంట్రోల్స్ కలవు.

ఇందులో గల సెంటర్ కన్సోల్ విభాగంలో ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థకు చెందిన డిస్ల్పే కలదు.

మారుతి సుజుకి ఈ న్యూ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారులో 1.0-లీటర్ టర్భో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించనుంది, ప్రస్తుతం దీనిని బాలెనొ ఆర్‌ఎస్ వేరియంట్లో అందించనుంది.

ఈ సరికొత్త స్విఫ్ట్ అంతే కాకుండా మారుతి వారి సాదారణ ఇంజన్ ఆప్షన్లు అయిన 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌లలో అందుబాటులోకి రానుంది.

మారుతి ఈ నూతన తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను 2017 సంవత్సరంలో భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది.

- బుద్దున్నా ఇలాంటి రోడ్ల మీద వెళ్లాలనుకోరు: ఎందుకో తెలుసా ?
- మళ్లీ పుట్టిన నూతనత్వం: టయోటా క్రిస్టా వర్సెస్ టయోటా ఇన్నోవా
- 1.0-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో మారుతి సుజుకి వితారా బ్రిజా అతి త్వరలో


Click it and Unblock the Notifications