2016 ప్యారిస్ మోటార్ షో లో మెరిసిన 2017 ఆడి క్యూ5
దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద రెండవ తరానికి చెందిన క్యూ56 ను ప్రదర్శించింది. కొత్త రంగుల్లో ప్రదర్శన వేదిక మీద ఆటోమొబైల్ ప్రియుల్ని మంత్రముగ్దుల్ని చేసిన ఆడి క్యూ5 నూతన రంగులో నిర్ధిస్టమైన ప్రమాణాలతో కొలువుదీరింది.

2017 కు చెందిన ఈ ఆడి క్యూ5 ప్రస్తుతం ఉన్న క్యూ5 తో పోల్చుకుంటే మరింత ఆకర్షణీయంగా, ధృడంగా మరియు స్పోర్టివ్‌గా ఉంది. ముందు వైపు డిజైన్‌లో క్యూ7 మరియు క్యూ2 ల యొక్క లక్షణాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి.

2017 కు చెందిన ఈ రెండవ తరం క్యూ5 లో కూడా పనితీరు కనబరిచే ఎస్ క్యూ5 మరియు ఆర్ఎస్ క్యూ5 ఉత్పత్తులు ఉన్నాయి.

సరికొత్త 2017 ఆడి క్యూ7 లో ఎల్‌ఇడి హెడ్‌లైట్లు లేదంటే హై రిజల్యూషన్ మ్యాట్రిక్స్ ఎల్‌ఇడి సాంకేతికత గల టర్న్ డైనమిక్ లైట్లను అదే విధంగా డైనమిక్ టర్న్ సిగ్నల్స్ కలిగి ఉండే టెయిల్ లైట్లతో ఇది రానుంది.

ఆడి ఈ క్యూ5 సుమారుగా 14 రకాల ఎక్ట్సీరియర్ రంగుల్లో మన ముందుకు రానుంది. మరియు బాడీ మీద ఐదు కొత్తగా పరిచయం చేసిన

2017 ఆడి క్యూ5 లో 325బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 3.0-లీటర్ సామర్థ్యం గల వి6 డీజల్ ఇంజన్ కలదు. తరువాత ఇందులో ట్విన్ టుర్బో ఛార్జ్‌డ్ వెర్షన్ యొక్క ఇదే సమర్థ్యం ఉన్న సుమారుగా 500బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్‌ను అందివ్వనున్నారు.

ఆడి ఈ 2017 క్యూ5 లో ఐదు రకాల కాన్ఫిగరేషన్ పరికరాలను అందించి తమ ఉత్పత్తులను విడుదల చేయనుంది. అవి, స్పోర్ట్ మరియు డిజైన్, ఎస్ లైన్ స్పోర్ట్ ప్యాకేజి, డిజైన్ సెలక్షన్ మరియు ఎస్ లైన్ ఎక్ట్సీరియర్ ప్యాకేజిలు గా ఉన్నాయి.

కొలతల పరంగా సరికొత్త 2017 ఆడి క్యూ5 4.66మీటర్ల పొడవు, 1.89మీటర్ల వెడల్పు మరియు 1.66మీటర్ల ఎత్తుతో పాటు 2.82 మీటర్లు వీల్ బేస్ కలదు. మునుపటి క్యూ5 తో పోల్చుకుంటే తక్కువ బరువుతో రూపొందించబడింది. ఇందులోని ఇంటీరియర్‌లో ఐదు మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయ విపణిలోకి కూడా రెండవ తరానికి చెంది క్యూ5 తన అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి.

- ప్రపంచ అద్బుతాలలో ఒకటి సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తికరమైన విషయాలు
- 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ఎక్స్2 కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన బిఎమ్‌డబ్ల్యూ
- నానో పెలికాన్ టెస్టింగ్: విడుదల, విశిష్టతలేమి ?


Click it and Unblock the Notifications








