సమ్మర్‌లో కొత్త కారు కొంటున్నారా ? డిస్కౌంట్లు గల 11 కార్లు ఇక్కడ ఉన్నాయి
ఈ సమ్మర్‌లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా ? ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో చాలా వరకు కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాయి. అందులో కొన్ని సంస్థలు తమ ప్రత్యేకమైన ఉత్పత్తుల మీద భారీ ఆఫర్లను ప్రకటించాయి. అందులో 11 కార్లు విశిష్టమైన ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి మరియు వాటి మీద ఉన్న ఆఫర్ల గురించి క్రింది కథనంలో....

1. ఫియట్ పుంటో ఎవో
ఫియట్ మోటార్స్ ఏప్రిల్ మాసానికి గాను తమ పుంటో హ్యాచ్‌బ్యాక్ కారు మీద 65,000 నుండి 85,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న ఫియట్ డీలర్ల ప్రకారం వీటి ఆఫర్లలలో కొంచెం మార్పులు ఉంటాయి అని ప్రకటించింది. ఫియట్ పుంటో ఎవో యొక్క పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల మీద ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఫియట్ పుంటో ఎవో వివరాలు
ఫియట్ పుంటో ఎవో లోని 1172 సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ 15.8 కిలోమీటర్ల మైలేజ్ మరియు 1248సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 21.2 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇవ్వగలవు.

2. నిస్సాన్ మైక్రా
నిస్సాన్ వారి ఉత్తమ హ్యాచ్‌బ్యాక్ కారు మైక్రా మీద కూడా ఆఫర్లను ప్రకటించింది. మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారు మీద నిస్సాన్ సంస్థ సుమారుగా 70,000 రుపాయల విలువైన డిస్కౌంట్లను ప్రకటించింది.

నిస్సాన్ మైక్రా కారు గురించి
నిస్సాన్ సంస్థ మైక్రా కారును పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందించింది. ఇందులోని 1198 సీసీ పెట్రోల్ ఇంజన్ 18.44 కిమీలు మరియు 1461 సీసీ డీజల్ ఇంజన్ 23.08 కిమీలు మైలేజ్‌ను ఇవ్వగలవు. ఈ రెండింటిని మ్యాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌లో అందుబాటులో ఉంచింది.

3. మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ స్టింగ్‌రే
మారుతి సుజుకి తమ టాల్ బాయ్ మోడల్ అయిన వ్యాగన్‌ఆర్ స్టింగ్‌రే కారు మీద 70,000 రుపాయల వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్లను తక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచారు.

వ్యాగన్‌ఆర్ స్టింగ్‌రే కారు గురించి
ఇందులో ఉన్న 998 సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 20.51 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు. ఇది మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో కూడా కలదు.

4. మారుతి సుజుకి ఆల్టో 800
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు సాధించిస్తున్న కారు ఆల్టో 800. అయితే ఈ మధ్య కాలంలో రెనో వారి క్విడ్ కారుతో తీవ్ర పోటిని ఎదుర్కుంటోంది. ప్రస్తుతం ఆల్టో మీద మారుతి 55,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించింది.

మారుతి ఆల్టో 800 ఇంజన్ మరియు మైలేజ్
ప్రస్తుతం ఆల్టో 800 కారులో మారుతి సుజుకి 796 సీసీ కెపాసిటి గల పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంజన్‌లు కలవు. రెండు కూడా 22.74 కిలోమీటర్లు మైలేజ్‌ను ఇవ్వగలవు.

5. మహీంద్రా ఎక్స్‌యువీ500
మహీంద్రా వారి టాప్ మోడల్ అయిన ఎక్స్‌యూవీ500 వేరియంట్ మీద దేశవ్యాప్తంగా ఆఫర్‌ను ప్రకటింటించింది. ఈ ఎస్‌యువి మీద మహీంద్రా దాదాపుగా 75,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంజన్ మరియు మైలేజ్
మహీంద్రా అండ్ మహీంద్రా వారు ఈ ఎక్స్‌యూవీ500 ఎస్‌యువిలో 2179 సీసీ కెపాసిటి గల శక్తివంతమైన డీజల్ ఇంజన్‌ను అందించారు. ఇది లీటర్‌కు 16 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఈ మధ్యనే ఇందులోని కొన్ని వేరియంట్లను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పరిచయం చేసింది.

6.నిస్సాన్ టెర్రానో
నిస్సాన్ మోటార్స్ తమ టెర్రానో ఎస్‌యువి మీద 65,000 రుపాయల వరకు ఆఫర్‌ను ప్రకటించింది. ఈ టెర్రానో ఎస్‌యువి రెనో డస్టర్ లో ఉన్న అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను ఉపయోగించుకుంది. అయితే ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ పరిచయం అవలేదు.

నిస్సాన్ టెర్రానో ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు
ఇందులోని రెనో డస్టర్ యొక్క 1598 సీసీ పెట్రోల్ ఇంజన్ 13.2 కిమీలు మరియు 1461 సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 20.5 కిమీలు మైలేజ్‌ను ఇవ్వగలవు.

7. రెనో లాజి
రెనో ఇండియా తమ ఎమ్‍పివి వాహనం అయిన లాజీ మీద వేసవి కాలంలో ఆఫర్లుగా 2 లక్షల వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. రెనో లాజీ వాహనం ఇంటీరియర్ ఎంతో విశాలమైనది.

రెనో లాజి ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు
రెనో ఇందులో కేవలం డీజల్ ఇంజన్‌ను మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఇందులో 1461 సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌ను కలదు. ఇది సుమారుగా లీటర్‌కు 21.04 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది.

8.ఫియట్ లీనియా
ప్రస్తుతం ఫియట్ లో అతి తక్కువ అమ్మకాలు సాధింస్తున్న మోడల్ ఈ లీనియా సెడాన్ కారు. అమ్మకాలను పెంచడమే లక్ష్యందా లీనియా మీద ఫియట్ ప్రస్తుతం1.25 లక్షల వరకు ఆఫర్లను ప్రకటించింది.

ఫియట్ లీనియా ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు
ఫియట్ సంస్థ ఈ లీనియా సెడాన్ కారును పెట్రోల్ మరియు డీజల్ ఆప్షన్‌లలో అందించింది. ఇందులోని 1368 సీసీ పెట్రోల్ ఇంజన్ 15.7 కిమీలు మరియు 1248 సీసీ డీజల్ ఇంజన్ 20.4 కిమీల మైలేజ్‌ను ఇవ్వగలవు.

9. రెనో స్కాలా
రెనో స్కాలా కూడా పెద్ద అమ్మకాలను సాధించలేకపోతోంది. అందుకో ఈ సారైనా అమ్మకాలను పెంచాలనే ఉద్దేశ్యంతో స్కాలా సెడాన్ మీద రెనో 85,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.

రెనో స్కాలా ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు
స్కాలా సెడాన్ కారులో 1498 సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ 16.95 కిమీలు మరియు 1461 సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 21.64 కిమీ మైలేజ్ ఇవ్వగల ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే రెండు ఇంజన్‌లు కూడా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి.

10.నిస్సాన్ సన్నీ
నిస్సాన్ వారి సన్నీ కారు కూడా అమ్మకాల పరంగా వెనకడుగులే వేస్తోంది. ఎలాగైనా ఈ సమ్మర్‌లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు చేపట్టాలని 75,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించింది.

నిస్సాన్ సన్నీ ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు
సన్నీ కారులోని 1498 సీసీ పెట్రోల్ ఇంజన్ 16.95 కిమీలు మరియు 1461 సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్ 22.71 కిమీల మైలేజ్‌ని ఇవ్వగలవు. రెండు వేరియంట్లు కూడా మ్యాన్యువల్ ట్రాన్‌మిషన్‌లో అందుబాటులో ఉన్నాయి.

11. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్
ఇండియాలో ప్రస్తుతం సెకండ్ బెస్ట్ సెల్లింగ్ కారు అయిన స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారు మీద కనిష్టంగా 15,000 నుండి గరిష్టంగా 35,000 రుపాయల వరకు ఆఫర్ ప్రకటించింది. ఇందులోని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మీద 25,000 వరకు ఆఫర్‌ను ప్రకటించింది.

స్విఫ్ట్ డిజైర్ ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు
స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారులో మారుతి సుజుకి 20.85 కిమీలు మైలేజ్ ఇవ్వగల 1197 సీసీ పెట్రోల్ ఇంజన్ మరియు 26.59 కిమీలు మైలేజ్ ఇవ్వగల 1248 సీసీ డీజల్ ఇంజన్‌ను అందించింది. స్విఫ్ట్ డిజైర్ కారు ఇప్పుడు ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లలో లభిస్తోంది.

ఇండియన్ మార్కెట్లో మీరు చెల్లించే సొమ్ముకు సరైన విలువ గల కార్లు
రకరకాల రంగుల్లో ఉన్న నెంబర్ ప్లేట్లు: ఎవరెవరు వేటిని ఉపయోగిస్తారు


Click it and Unblock the Notifications