ఈ ఆఫర్లు మీ నిర్ణయాలను ఖచ్చితంగా మార్చుతాయి
ఆగష్టు 2016 గాను ఇండియాలో ఉన్న చాలా కార్ల తయారీ సంస్థలు తమ విభిన్న ఉత్పత్తుల మీద ఆఫర్లను మరియు డిస్కౌంట్లను ప్రకటించారు. ఈ మాసంలో కొత్త కారును కొనుగోలు చేయాలని భావిస్తుంటే క్రింది కథనంలో ఉన్న ఆఫర్లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏ కార్ల మీద ఏ విధమైన ఆఫర్లు ఉన్నాయో క్రింది కథనం మీద ఓ లుక్కేసుకోండి.

మారుతి సుజుకి స్టింగ్ రే
భారత దేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికు చెందిన వ్యాగన్ స్టింగ్‌రే ఆర్ మీద సుమారుగా 70,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించారు. ఈ వ్యాగన్ ఆర్ స్టింగ్ రే ను ఇప్పుడు స్టైలిష్ ట్రీట్‌మెంట్‌లో అందిస్తున్నారు.

వ్యాగన్ ఆర్ స్టింగ్ రే
మారుతి వ్యాగన్ ఆర్ స్టింగ్ రే లో 998సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో కూడా అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
హ్యుందాయ్ మోటార్స్ వారి పాపులర్ హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 మీద సుమారుగా 45,000 రుపాయల వరకు ఆఫర్ ప్రకటించారు. అయితే కొన్ని వేరియంట్ల మీద మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది.

గ్రాండ్ ఐ10
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.1-లీటర్ డీజల్ ఇంజన్‌లలో లభించును. ఇందులోని పెట్రోల్ వేరియంట్‌కు 5-మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మరియు డీజల్ ఇంజన్ కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

వోక్స్‌వ్యాగన్ పోలో
దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్లలో ఎంచుకోదగ్గ డీలర్ షిప్‌ల వద్ద సుమారుగా 35,000 ల రుపాయల వరకు ఆఫర్లు ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో
స్పోర్టివ్ వోక్స్‌వ్యాగన్ పోలో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. పోలో జిటి వర్షన్ ఉత్తమ పవర్ విడుదల చేయును మరియు ఆటోమేటిక్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌ను టిఎస్‌ఐ వేరియంట్లో అందిచారు.

ఫియట్ అవెంచురా
ఎస్‌యువి మరియు హ్యాచ్‌బ్యాక్ తరహాలో ఉండే కారు కావాలనుకునే వారికి ఫియట్ అవెంచురా మంచి ఎంపికని చెప్పవచ్చు. అవెంచురా, పుంటో శ్రేణిలో ఉన్న క్రాసోవర్ మీద 65,000 రుపాయల వరకు ఆఫర్లను ప్రకటించారు.

ఫియట్ అవెంచురా
ఫియట్ అవెంచురా పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లలో అందుబాటులో ఉంది. ఇందులోని 1.4-లీటర్ సామర్థ్యల గల ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. అదే విధంగా 1.3-లీటర్ మల్టీ జెట్ ఇంజన్ 75బిహెత్‌పి పవర్ మరియు 197ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ తమ ఎక్స్ 5 మీద సుమారుగా 5.5 లక్షల వరకు ఆఫర్ ప్రకటించింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 లో 3.0-లీటర్ సామర్థ్యం గల ఇంజన్ కలదు. ఇది మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ మరియు జిఎల్ఎస్ మోడళ్లకు పోటీగా ఉంది.

రెనో డస్టర్ ఎమ్‌టి
దేశీయంగా రెనో మొదటి కాంపాక్ట్ ఎస్‌యువి డస్టర్‌ను విడుదల చేసింది. దీని వలన అనేక కార్ల తయారీ సంస్థలు తమ లైనప్‌లోకి ఎస్‌యువిలను పరిచయం చేశాయి. తద్వారా ఈ సెగ్మెంట్లో రెనో డస్టర్‍కు విపరీతమైన పోటీ ఏర్పడింది. రెనో ఇండియా తమ డస్టర్ మ్యాన్యువల్ వేరియంట్ల మీద సుమారుగా 70,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.

రెనో డస్టర్
ఈ డస్టర్ ఎస్‌యువి పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఈ రెండు కూడా ఆటేమేటిక్ మరియు మ్యాన్యువల్ రెండు ట్రాన్స్‌మిషన్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ డస్టర్ మీద మాత్రమే ఆఫర్లు ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ సి 200
మెర్సిడెస్ బెంజ్ తమ సి 200 మీద 4 లక్షలు రుపాయల సాలిడ్ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్‌లో ఇన్సూరెన్స్ కూడా కలిసి ఉంది. దేశ వ్యాప్తంగా కొంత మంది డీలర్ల వద్ద మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

మెర్సిడెస్ బెంజ్ సి 200
ఈ మెర్సిడెస్ బెంజ్ సి 200 సెడాన్ ఆడి ఎ4, బిఎమ్‌డబ్ల్యూ 4-సిరీస్ మరియు జాగ్వార్ ఎక్స్ఇ వంటి వాటికి పోటీగా ఉంది.

స్కోడా ర్యాపిడ్
మిడ్ సైజ్ సెడాన్‌లకు పోటీగా నిలిచే స్కోడా ర్యాపిడ్ లో సుమారుగా 1.10 లక్షల వరకు ఆఫర్ ప్రకటించారు.

స్కోడా ర్యాపిడ్
స్కోడా ర్యాపిడ్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభించును. ఇందులోని 1.6-లీటర్ పెట్రోల్ ఎమ్‌పిఐ ఇంజన్ సుమారుగా 103బిహెచ్‌పి పవర్ మరియు 153ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అదే విధంగా 1.5-లీటర్ డీజల్ టిడిఐ ఇంజన్ సుమారుగా 103బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

హోండా అమేజ్
హోండా సంస్థ ఈ మద్యనే అమేజ్ ఫేస్‍లిఫ్ట్‌ను విడుదల చేసింది. అయితే పాత అమేజ్ కార్ల అమ్మకాలు మాత్రం స్తంభించిపోయాయి. అందుకోసం ఫేస్ లిఫ్ట్ కన్నా ముందున్న అమేజ్‌లను అమ్మడానికి వాటి మీద గరిష్టంగా లక్ష వరకు ఆఫర్ ప్రకటించింది.

హోండా అమేజ్
హోండా మోటార్స్ అమేజ్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (మ్యాన్యువల్ మరియు సివిటి గేర్ బాక్స్‌లతో) మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందించారు. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

నిస్సాన్ సన్నీ
నిస్సాన్ వారి సన్నీ సెడాన్ కారులో ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ విశాలమైన క్యాబిన్ స్పేస్‌తో పాటు లెగ్ రూమ్ స్పేస్ అధికంగా ఉంటుంది. సన్నీ మీద నిస్సాన్ సుమారుగా 90,000 రుపాయల వరకు ఆఫర్ ప్రకటిచింది.

నిస్సాన్ సన్నీ
నిస్సాన్ సన్నీ 1.5-లీటర్ సామర్థ్యంతో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని పెట్రోల్ వేరియంట్ 98బిహెచ్‌పి పవర్ మరియు 134ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదే విధంగా డీజల్ ఇంజన్ 85బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

వోక్స్‌వ్యాగన్ వెంటో
వోక్స్‌వ్యాగన్ సంస్థ తమ ప్రీమియమ్ సెడాన్ వెంటో మీద సుమారుగా రూ. 75,000 ల వరకు డిస్కౌంట్లను ప్రకటించారు.

వోక్స్‌వ్యాగన్ వెంటో
ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్, 1.2-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిడిఐ ఇంజన్‌లకు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించారు.

మారుతి సుజుకి సియాజ్
మారుతి సుజుకి వారి సియాజ్ సెడాన్ సెగ్మెంట్లో అత్యుత్తమ అమ్మకాలు సాధించి బెస్ట్ సెల్లింగ్ సెడాన్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సెడాన్ మీద రూ. 45,000 వరకు ఆఫర్లను ప్రకటించారు, దీని ద్వారా అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాని సియాజ్‌లోని ఆర్ఎస్ వేరియంట్ మినహాయించి మిగతా అన్నింటికి ఆఫర్లు వర్తించును.

మారుతి సుజుకి సియాజ్
మారుతి సుజుకి సియాజ్ 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లో లభించును. పెట్రోల్ వేరియంట్ మ్యాన్యువల్ మరియు ఆటేమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో అదే విధంగా డీజల్ వేరియంట్ కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో కలదు.

ముగింపు
నాణ్యత, పనితీరు వంటి అంశాలను పట్టించుకోకుండా ఆఫర్లు లభిస్తే కారు కొనుగోలు చేయాలనుకునే వారు,రెండో ఆలోచన లేకుండా ఈ జాజితాలో ఉత్తమ ఆఫర్లను అందిస్తున్న కారు ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








