షెవర్లే నుండి 2016 న్యూ క్రూయిజ్ సెడాన్ విడుదల: ధర, ఫీచర్లు, ఇతర వివరాల కోసం

By Anil

ఆటోమొబైల్ పోటి ప్రపంచంలో షెవర్లే కార్ల సంస్థ గట్టి పునాదులు వేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా షెవర్లే ఇండియా దేశీయ మార్కెట్లోకి సరికొత్త 2016 క్రూయిజ్ సెడాన్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. అదనపు ఫీచర్లు మరియు బాహ్య డిజైన్‌లో స్వల్ప మార్పులతో షెవర్లే ఇండియా వారు ఈ 2016 క్రూయిజ్ సెడాన్ కారును అభివృద్ది చేశారు.
Also Read: టాటా జెస్ట్ రాకతో మారుతి సుజుకి డిజైర్‌కు గడ్డు కాలం ఎర్పడింది అంటున్న నిపుణులు
షెవర్లే 2016 క్రూయిజ్ సెడాన్ కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

షెవర్లే 2016 క్రూయిజ్ సెడాన్ లభించు వేరియంట్లు

షెవర్లే 2016 క్రూయిజ్ సెడాన్ లభించు వేరియంట్లు

  • షెవర్లే క్రూయిజ్ ఎల్‌టి మ్యాన్యువల్
  • షెవర్లే క్రూయిజ్ ఎల్‌టిజెడ్ మ్యాన్యువల్
  • షెవర్లే క్రూయిజ్ ఎల్‌టిజెడ్ ఆటోమేటిక్
  •  2016 క్రూయిజ్ ఇంజన్

    2016 క్రూయిజ్ ఇంజన్

    షెవర్లే మోటార్స్ ఈ 2016 క్రూయిజ్ సెడాన్ కారులో 2.0-లీటర్ కెపాసిటి గల విసిడిఐ టర్భో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ను కల్పించారు.

     ట్రాన్స్‌మిషన్

    ట్రాన్స్‌మిషన్

    ఇందులో ట్రాన్స్‌మిషన్ విశయానికి వస్తే మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ఆప్షన్‌ గల 6-స్పీడ్ గేర్ బాక్స్‍‌ను కల్పించారు.

     శక్తి

    శక్తి

    ఇందులో ఉన్న అత్యంత శక్తివంతమైన ఇంజన్ మీకు ఇస్తుంది 163.72 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేస్తుంది.

     డిజైన్

    డిజైన్

    షెవర్లే ఇండియా ఈ 2016 క్రూయిజ్ కారుకు ముందు వైపున చక్కటి ఫాసికా డిజైన్ కల్పించారు. వెనుక వైపున అప్ డేట చేయబడిన స్పాయిలర్ మరియు సరికొత్త రూపాన్ని కలిగిన ఎగ్జాస్ట్ పైపులను కల్పించారు.

    న్యూ లాంప్స్

    న్యూ లాంప్స్

    2016 క్రూయిజ్ సెడాన్ కారులో ఫాగ్ ల్యాంప్స్ ( దట్టమైన మంచు కురిసే సమయంలో వెలిగే లైట్లు), ఎల్‌ఇడి డే టైమ్ రన్నింగ్ లైట్లు (పగటి పూట వేలిగే లైట్లు ) మరియు నూతన శైలి డిజైన్ కలిగిన ఇంటీరియర్ కలవు.

     2016 క్రూయిజ్ సెడాన్ ధరలు

    2016 క్రూయిజ్ సెడాన్ ధరలు

    • షెవర్లే క్రూయిజ్ ఎల్‌టి మ్యాన్యువల్ ధర రూ. 14.68 లక్షలు
    • షెవర్లే క్రూయిజ్ ఎల్‌టిజెడ్ మ్యాన్యువల్ ధర రూ. 16.75 లక్షలు
    • షెవర్లే క్రూయిజ్ ఎల్‌టిజెడ్ ఆటోమేటిక్ ధర రూ. 17.81 లక్షలు
    • అన్ని ధరలు కూడా ఎక్స్ షో రూమ్ (ఢిల్లీ)

       వినోదం

      వినోదం

      ఏడు అంగుళాలు తాకే తెర పరిమాణం గల మై లింక్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, స్మార్ట్ రేడియో, గ్రాస్ నోట్ మరియు సిరి ఐస్ ఫ్రీ కంప్యాటబులిటీ గల వినోదమైన వ్యవస్థలను ఇందులో అందించారు. వెనుకవైపున గమనించే కెమెరాను ఇందులో కల్పించారు.

      భద్రత ఫీచర్లు

      భద్రత ఫీచర్లు

      భద్రత పరంగా షెవర్లే వారు ఈ 2016 క్రూయిజ్ సెడాన్ కారులో ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగులు మరియు రెండు సైడ్ ఎయిర్ బ్యాగ్‌లను అందించారు. యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ , ఎలక్ట్రానిక్ సెన్సార్లు, ప్యాసివ్ ఎంట్రీ ప్యాసివ్ స్టార్ట్, చిల్డ్ సీట్ ప్రొవిజన్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, యాంటి థెఫ్ట్ అలారమ్, ఆటోమేటిక్ డోర్ లాక్స్ వంటి ఫీచర్లు కలవు.

      షెవర్లే 2016 న్యూ క్రూయిజ్ సెడాన్ మార్కెట్లోకి విడుదల
      • మారుతి సుజుకి వితారా బ్రిజా వేరియంట్లు మరియు ఫీచర్లు
      • క్రిస్టా అనే పేరుతో వస్తున్న సరికొత్త టయోటా ఇన్నోవా

More from DriveSpark

Article Published On: Monday, February 1, 2016, 10:58 [IST]
English summary
New Chevrolet Cruze Launched In India At Rs. 14.68 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+