మరింత పెరిగిన ఫోర్డ్ ఎండీవర్ ధరలు: ధరల జాబితా
అమెరికన్ కార్ల తయారీ సంస్థ పోర్డ్ ఈ మధ్యనే తమ ఫిగో ఆస్పైర్ మరియు ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ల మీద ధరలను తగ్గించింది. అయితే ఇప్పుడు పోర్డ్ తమ ఎండీవర్ ఎస్‌యువి మీద సుమారుగా రూ. 1.62 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది.

ధరలను సవరించింన తరువాత ఫోర్డ్ ఎండీవర్ ప్రారంభం ధర రూ. 25 లక్షలు మరియు గరిష్ట ధర రూ. 29.77 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

ధరలను తగ్గించిన తరువాత ఫోర్డ్ ఎండీవర్ ధరలు
- 2.2-లీటర్ 4X2 మ్యాన్యువల్ ట్రెండ్ ధర రూ. 25,00,800 లు
- 2.2-లీటర్ 4X2 ఆటోమేటిక్ ట్రెండ్ ధర రూ. 25,50,800 లు
- 2.2-లీటర్ 4X4 మ్యాన్యువల్ ట్రెండ్ ధర రూ. 26,600,800 లు
- 2.2-లీటర్ 4X2 ఆటోమేటిక్ టైటానియమ్ ధర రూ. 27,50,800 లు
- 3.2-లీటర్ 4X4 ఆటోమేటిక్ ట్రెండ్ ధర రూ. 27,65,800 లు
- 3.2-లీటర్ 4X4 ఆటోమేటిక్ టైటానియమ్ ధర రూ. 29,76,800 లు
- (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి).
- ఫోర్డ్ ఎండీవర్ పూర్తి విడుదల వివరాలు


ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఫోర్డ్ ఎండీవర్ రెండు ఇంజన్ ఆప్షన్లతో మరియు రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

ఫోర్డ్ ఎండీవర్‌లోని 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ సుమారుగా 158బిహెచ్‌పి పవర్ మరియు 385ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ కలదు. మరియు ఆప్షనల్‌గా ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా అందించారు.

ఫోర్డ్ ఎండీవర్‌లోని రెండవ ఇంజన్ 3.2-లీటర్ సామర్థ్యం ఉన్న ఐదు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 197బిహెచ్‌పి పవర్ మరియు 470ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

3.2-లీటర్ ఇంజన్ గల ఎండీవర్ లో స్టాండర్ట్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఫోర్ డ్రైర్ సిస్టమ్ కలదు.



Click it and Unblock the Notifications








