కొత్త ఇంటీరియర్ డిజైన్‌తో హోండా అమేజ్
హోండా మోటార్స్ సంస్థ తమ మొబిలియో కారును కొన్ని ఇంటీరియర్ మార్పులతో ఇండేనేషియాలో విడుదల చేసింది. అయితే అచ్చం అలాంటి ఇంటీరియర్ డిజైన్‌తో హోండా తమ అమేజ్ కారును మార్కెట్లోకి అందివ్వాలని ఆలోచిస్తోంది. ఇదే తరహాలో బ్రియో కారుకు కూడా కొన్ని మార్పులు చేయాలనే ఆలోచనలో ఉంది.

బిఆర్-వి కారులోని డ్యాష్ బోర్డ్‌తో పోల్చితే జాజ్ మరియు సిటి కార్లలో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ క్రింద కల్పించారు. అయితే వీటిలో క్లైమేట్ కంట్రోల్ గల క్యాబిన్‌ను కల్పించలేక పోయారు. కాని కొత్త మోడల్‌లో ఈ ఆప్షన్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి. ట
హోండా సిటిలో రెక్టాంగులర్ ఆకారంలో ఎయిర్ వెంట్స్ కలవు, 6.1 అంగుళాల తాకే తెర పరిమాణం గల మల్టీమీడియా యూనిట్ అదే ప్రారంభపు వేరియంట్లలో సింగల్ మరియు డబుల్ డిఐఎన్ రేడియో సిస్టమ్ కలదు. ఆడియో మరియు వీడియో న్యావిగేషన్ సిస్టమ్ అలాగే కొనసాగించారు. స్టీరింగ్ వీల్ ఎటువంటి మార్పులను పొందలేదు.
Also Read: మహీంద్రా కెయువి100 ఫోటోలు: తనివితీరా చూసుకోండి....!!
ఇండోనేషియాలో విడుదల చేసిన వాటిలో కేవలం పెట్రోల్ కార్లు మాత్రమే ఉన్నాయి. అందులో 1.2-లీటర్ i-VTEC ఇంజన్ కలదు. కాని భారతీయ మార్కెట్లో ఇది పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ద్వారా అందుబాటులో ఉంది. ఇందులో 1.5-లీటర్ i-DTEC ఇంజన్ కలదు.


Click it and Unblock the Notifications













