బ్రియో ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, విడుదల వివరాల కోసం
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ బ్రియో ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఫేస్‌లిఫ్ట్ బ్రియో యొక్క ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా హోండా ప్రకటిచింది.

హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్ ధరలు
- బ్రియో ఇ ధర రూ. 4,69,000 లు
- బ్రియో ఎస్ ధర రూ. 5,20,000 లు
- విఎక్స్ ధర రూ. 5,95,000 లు
- విఎక్స్ ఆటోమేటిక్ ధర రూ. 6,81,600 లు
- అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
- సర్జికల్ స్ట్రైక్స్‌లో కీలక పాత్ర పోషించిన ధృువ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికర విషయాలు
- టిగువాన్ SUVని దిగుమతి చేసుకుంటున్న వోక్స్‌వ్యాగన్

హోండా మోటార్స్ ఈ బ్రియో ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మీద రెండు సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది.

హోండా ఈ బ్రియో ఫేస్‌లిఫ్ట్‌లో అదే 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది.

బ్రియో ఫేస్‌లిఫ్ట్‌లోని శక్తివంతమైన 1.2-లీటర్ ఇంజన్ 6,000ఆర్‌పిఎమ్ వద్ద 87బిహెచ్‌పి పవర్ మరియు 4,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 109ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని పెట్రోల్ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసింది.

మ్యాన్యువల్ బ్రియో ఫేస్‌లిఫ్ట్ లీటర్‌కు 18.5కిలోమీటర్లు అదే విధంగా ఆటోమేటిక్ బ్రియో ఫేస్‌లిఫ్ట్ లీటర్‌కు 16.5కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

ప్రస్తుతం బ్రియో ఫేస్‌లిఫ్ట్ పొడవు 3,610ఎమ్ఎమ్, వెడల్పు 1,680ఎమ్ఎమ్, 1,500ఎమ్ఎమ్ ఎత్తు మరియు 2,345ఎమ్ఎమ వీల్ బేస్ కలదు.

కొలతల పరంగా చిన్నగా ఉన్న బ్రియో మ్యాన్యువల్ యొక్క టర్నింగ్ రేడియస్ 4.5మీటర్లు మరియు బ్రియో ఆటోమేటిక్ టర్నింగ్ రేడియస్ 4.7మీటర్లుగా ఉంది.

డిజైన్‌లో చోటు చేసుకున్న మార్పులు పరంగా చూస్తే బ్రియో ఫేస్‌లిఫ్ట్‌లో రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, గ్లోసీ మరియు క్రోమ్ ఫినిషింగ్ గల సరికొత్త ఫ్రంట్ గ్రిల్ కలదు.

వెనుక వైపు డిజైన్‌లో చిన్న పరిమాణంలో ఉన్న టెయిల్ గేట్ మౌంటెడ్ స్పాయిలర్, నూతనంగా డిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్ మరియు రివైజ్డ్ బంపర్ కలదు.

బ్రియో ఫేస్‌లిఫ్ట్‌లోని ప్రారంభ వేరియంట్లలోని ఇంటీరియర్ బీజి రంగులో మరియు టాప్ ఎండ్ వేరియంట్లలో ఇంటీరియర్ బ్లాక్ కలర్‌లో కలదు.

ఇంటీరియర్‌లోని ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను కార్బన్ ఫినిషింగ్‌తో నిర్మించారు. సిల్వర్ సొబగులు మరియు వైట్ ఇల్లుమినేషన్ కలదు.

2 డిఐఎన్ ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్ కలదు. ఇది యుఎస్‌బి మరియు ఏయుఎక్స్ ను సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ అనుసంధానం మరియు హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ ఫంక్షన్ కూడా ఇందులో ఉంది.

భద్రత పరంగా ఫేస్‌లిఫ్ట్ బ్రియోలో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్ విత్ లోడ్ లిమిట్, హెడ్ రెస్ట్‌లు కలవు.

పాదచారుల ప్రమాదాన్ని అరికట్టే సాంకేతికతను హోండా ఈ సరికొత్త బ్రియో ఫేస్‌లిఫ్ట్‌లో పరిచయం చేశారు. తద్వారా బ్రియో నుండి జరిగే పాదచారుల ప్రమాదాలను నివారించవచ్చు.



Click it and Unblock the Notifications








