సరికొత్త హోండా బిఆర్-వి కాంపాక్ట్ సెడాన్ ఫోటో గ్యాలరీ

By Anil

జపాన్‌కు చెందిన హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రముఖ నగరాలలో తమ కాంపాక్ట్ ఎస్‌యువి బిఆర్-వి వాహనాన్ని విడుదల చేసింది. విడుదల సమయం నుండి నెటిజన్లు గూగుల్ మీద దీని గురించి విపరీతంగా శోధించారు. హోండా మోటార్స్ వినియోగదారులను సరైన ధరతో ఆకర్షించడానికన్నట్లుగా బిఆర్-వి ని కేవలం రూ 8,75,650 లు ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చారు. ఇది చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఇది ఎలా ఉందో క్రింది గల ఫోటోల ద్వారా చెక్ చేసుకోండి.

హోండా బిఆర్-వి


ఇంజన్ మరియు సాంకేతి వివరాలు:
హోండా మోటార్స్ ఈ సరికొత్త బిఆర్-వి ఎస్‌యువిను పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్లలో అందించింది. రెండు కూడా 1.5-లీటర్ సామర్థ్యంతో ఉన్నాయి. రెండు ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు పెట్రోల్ ఇంజన్ అదనంగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో పాటు అందుబాటులో ఉంది.
హోండా బిఆర్-వి

పవర్ మరియు మైలేజ్ వివరాలు:
హోండా మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లో అందించిన ఈ బిఆర్-వి వాహనం హ్యాచ్‌బ్యాక్ కార్ల తరహాలో మైలేజ్‌ను ఇస్తోంది. 1.5-లీటర్ పెట్రోల్ 117 బిహెచ్‌పి పవర్ మరియు 140 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌తో పాటు 15.4 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగలదు. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల వేరియంట్ లీటర్‌కు 16 కిలోమీటర్ల మైలేజ్‌నిస్తుంది. ఇక 1.5-లీటర్ డీజల్ ఇంజన్ పరంగా చూస్తే ఇది 98 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ తో పాటు లీటర్‌కు 21.9 కిలోమీటర్లు మైలేజ్‌నివ్వగలదు.
Also Read: హోండా బిఆర్-వి యొక్క ధరలు మరియు విడుదల వివరాల కోసం.....

హోండా బిఆర్-వి ప్రారంభ వేరియంట్‌లోని ఫీచర్లు:
  • ముందు వైపు రెండు ఎయిర్ బ్యాగులు (అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా ఉంది)
  • యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (కేవలం డీజల్ వేరియంట్లో)
  • ఎల్‌ఇడి టెయిల్ లైట్ గైడ్ గల ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
  • ముందు వైపు క్రోమ్ ఫ్రంట్ గ్రిల్
  • బాడీ రంగులో ఉండే డోర్ హ్యాండిల్స్ మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్
  • మూడు వరుసలలో ఉన్న హెడ్ రెస్ట్‌లను అడ్జెస్టే చేసుకునే సదుపాయం
  • రెండవ వరుసలోని సీట్లను 60:40 మరియు మూడవ వరుసలో ఉన్న సీటును 50:50 నిష్పత్తిలో మలుపుకునే అవకాశం
  • డిజిటల్ ఏ/సి కంట్రోల్
  • ఎకో ల్యాంప్
  • అన్నింటిలో కూడా పవర్ విండోలు
  • టిల్ట్ స్టీరింగ్ మరియు ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

హోండా బిఆర్-వి

పోటి మరియు అందుబాటులోకి:

గత వారంలో దేశీయంగా విడుదలైన హోండా బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువి వాహనం రెనో వారి డస్టర్‌కు పోటీనివ్వనుంది. అంతే కాకుండా కొంత వరకు క్రెటా అమ్మకాల మీద కూడా ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఇది దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని హోండా డీలర్ షిప్‌ల వద్ద సిద్దంగా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, May 9, 2016, 12:44 [IST]
English summary
All New Honda Brv Compact Suv Photo Gallery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+