సరికొత్త హోండా సివిక్ ఫోటోలు మరియు వివరాల వెల్లడి
జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ తమ సివిక్ శ్రేణికి చెందిన సరికొత్త సివిక్ కారుకు రాజస్థాన్‌లోని తమ కార్ల ఉత్పత్తి ప్లాంటులో పరీక్షలు నిర్వహించారు. అంతర్జాతీయంగా విడుదల కోసం సిద్దం చేస్తున్న సివిక్‌ను దేశీయంగా పరీక్షిస్తున్నట్లు తెలిసింది.
దీనిని కూడా చదవండి: 20 వేల టియాగో బుకింగ్‌లు: ఈ విజయం వెనకున్న ముఖ్య కారణాలు
రహస్యంగా విడుదలైన ఫోటోలలో సరికొత్త సివిక్ ముందువైపు డిజైన్ మరియు ఇంటీరియర్‌లోని ముందు భాగాన్ని గుర్తించే విధంగా ఉన్నాయి. ఇంటీరియర్‌లోని ఫ్రంట్ ఎండ్‌లో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ కలర్ డిస్ల్పే కలదు. ఇందులోనే ఆటోమేటిక్ క్లేమేట్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను గమనించవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్ కోసం రూపుదిద్దుకుంటున్న హోండా వారి సరికొత్త సివిక్ కారులో 1.5 లీటర్ సామర్థ్యం గల టర్బో చార్జ్‌డ్ ఇజంన్ మరియు 2.0 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్‌ను అందివ్వనున్నారు. దీనిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేలోపు దీని కోసం డీజల్ ఇంజన్‌ను కూడా అభివృద్ది చేయనున్నట్లు తెలిసింది.



Click it and Unblock the Notifications








