సరికొత్త హ్యుందాయ్ కారుకు చెందిన రహస్య ఫోటోలు: కొత్త శ్యాంట్రోకు చెందినవేనా ?
ఇండియన్ మార్కెట్లోకి శ్యాంట్రో కారుతో ఎంట్రీ ఇచ్చిన కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఈ మధ్యనే 20 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సంధర్బంగా తమ ఇకానిక్ మోడల్ అయిన శ్యాంట్రో హ్యాచ్‌బ్యాక్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
అత్యంత రహస్యంగా హ్యుందాయ్ మోటార్స్ ఒక కొత్త కారుకు పరీక్షలు జరపింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

ముందు వైపున ఉన్న డిజైన్ గమనిస్తే హ్యుందాయ్ కుంటుంబానికి చెందిన దానికిగా స్పష్టమవుతోంది. ముందు వైపున ఉన్న యాంగులర్ టెయిల్ ల్యాంప్స్ మరియు బంపర్ రెండూ కూడా అదే కోవలో ఉన్నాయి.

సరికొత్త హ్యుందాయ్ శ్యాంట్రో ఇయాన్ లోని 1.0 లీటర్ ఇంజన్‌ను వినియోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది 2017 నాటికి ఇండియన్ రోడ్ల మీదకు రానున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications








