మారుతి సుజుకి నుండి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్: రహస్య ఫోటోలు

By Anil

మారుతి సుజుకి వచ్చే నెలలో దేశీయ మార్కెట్లోకి అత్యంత విజయవంతమైన తమ ఎంట్రీ లెవల్ కారు ఆల్టో 800 ను ఫేస్ లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే మారుతి దీనిని పరీక్షల నిమిత్తం రోడ్డు మీదకు తెచ్చింది. అపుడు కెమెరా కంటికి దొరికిన ఫోటోలు మరియు కొన్ని ఇతర సాంకేతిక వివరాలు క్రింది కథనంలో.

మారుతి సుజుకి నుండి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్: రహస్య ఫోటోలు

మారుతి సుజుకి తమ ఆల్టో 800 ఫేస్ లిఫ్ట్ కారులో డిజైన్ పరంగా ఎక్కువ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ముందు వైపు డిజైన్‌లో ఎక్కువ మార్పులను గమనించవచ్చు.

మారుతి సుజుకి నుండి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్: రహస్య ఫోటోలు

ముందు వైపు ఉన్న ఫ్రంట్ గ్రిల్ పూర్తిగా మార్పుకు గురైంది. అతి పెద్ద ఎయిర్ ఇంటేకర్ మరియు దాని పైన ఉన్న బంపర్ మీద సుజుకి యొక్క చిహ్నం అందించారు. అంతే కాకుండా ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్ డిజైన్ చేశారు.

మారుతి సుజుకి నుండి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్: రహస్య ఫోటోలు

హెడ్ లైట్లు మరియు టెయిల్ లైట్లను ఒకే విభాగంలో అమర్చారు. అయితే రెండింటిని కూడా క్రోమ్ పూత గల స్ట్రిప్స్ విభజించాయి మరియు టెయిల్ లైట్లను కొత్తగా పసుపు రంగుల్లో ఉండేట్లు తీర్చిదిద్దారు. మొత్తానికి ముందు వైపు డిజైన్‌తో ఆల్టో ఫేస్ లిఫ్ట్ మరింత స్లిమ్‌గా మారిందని చెప్పవచ్చు.

మారుతి సుజుకి నుండి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్: రహస్య ఫోటోలు

ప్రస్తుతం మారుతి సుజుకి తమ ఆల్టో 800 కారులో 796 సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను వినియోగించారు.

మారుతి సుజుకి నుండి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్: రహస్య ఫోటోలు

ఈ ఇంజన్ సుమారుగా 47 బిహెచ్‌పి పవర్ మరియు 69 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి నుండి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్: రహస్య ఫోటోలు

ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ గేర్ బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఇది సుమారుగా 22.7 కిలోమీటర్/లీటర్ మైలేజ్ ఇవ్వడానికి సహాయపడుతుంది. మారుతి దాదాపుగా ఇదే ఇంజన్‌ను ఈ ఆల్టో 800 ఫేస్‌ లిఫ్ట్‌లో వినియోగించనున్నట్లు తెలిసింది.

మారుతి సుజుకి నుండి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్: రహస్య ఫోటోలు

మారుతి సుజుకి ఈ ఆల్టో 800 ఫేస్ లిఫ్ట్‌ను వచ్చే నెలలో విడుదల చేయనునన్నట్లు తెలిసింది. అంత వరకు తెలుగు డ్రైవ్ స్పార్క్‌తో కలిసి ఉండండి.

మారుతి సుజుకి నుండి ఆల్టో 800 ఫేస్‌లిఫ్ట్: రహస్య ఫోటోలు

రహస్యంగా టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి

సముద్రంలో ఉన్న దెయ్యం నౌకలు, వాటి వెనక దాగున్న రహస్యాలు ...!!

Source

Article Published On: Tuesday, May 10, 2016, 12:20 [IST]
English summary
Spied: New Maruti-Suzuki Alto 800
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+