2017 మారుతి స్విప్ట్ స్పోర్ట్‌లో కొత్త ఇంజన్ ఆప్షన్
సరికొత్త 2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌ను మారుతి సుజుకి ఇంగ్లాడులో విడుదల చేయడానికి నిర్ణయించింది. ప్రస్తుతం మారుతి అభివృద్ది చేసిన స్విఫ్ట్ స్పోర్ట్‌లో నాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.6 లీటర్ ఇంజన్ కలదు. దీని స్థానంలోకి 2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్‌లో 1.4 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వడానికి సన్నాహాలు చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు.

2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ కారులో మారుతి సుజుకి మొదటి సారిగా 1.4 లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. ఇంతకు ముందు మనం వితారా ఎస్-టర్భో లో వినియోగించిన ఇంజన్‌ను పోలి ఉంటుంది.

ఇందులోని వినియోగిస్తున్న ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్ మరియు 220 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం తరం స్విప్ట్ కన్నా 2017 మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ చాలా తక్కువ బరువుతో నిర్మితమవుతోంది. కాబట్టి ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది.

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్ కోసం 1.0 లీటర్ బూస్టర్ జెట్ ఇంజన్‌తో రానుంది. మరియు ఇది కేవలం 1000 కిలోల బరువు లోపు ఉండనుంది.

ఇది ఎక్కువ మార్పులతో కాకుండా ముందు వైపు మరియు ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్‌తో కొద్దిగా వితారా బ్రిజాను పోలి ఉండనుంది.

ఇంటీరియర్‌లో ఉన్న డ్యాష్ బోర్డ్ సింపుల్ మరియు స్పోర్టివ్‌గా ఉంటుంది. డ్యాష్ బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ మీద ఉన్న ఏ/సి వెంట్‌లు గుండ్రంగా ఎరుపు రంగులో ఉన్నాయి.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న హ్యాచ్‌బ్యాక్‌ల అన్నింటి మీద మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 2017 నాటికి మారుతి స్విప్ట్ స్పోర్ట్ వెర్షన్ కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఫోర్డ్ ఫిగొ మరియు మహీంద్రా కెయువి100 వంటి వాహనాలకు పోటీగా నిలవనుంది.



Click it and Unblock the Notifications








