లేటెస్ట్ అప్‌డేట్స్‌తో 2017 మారుతి వ్యాగన్ఆర్
ఇండియన్ మార్కెట్లోకి అత్యధిక కార్ల అమ్మకాలను సాధిస్తున్న బ్రాండ్ మారుతి సుజుకి. మారుతి సుజుకిలోని దాదాపు అన్ని ఉత్పత్తులు కూడా వినియోగదారుల మన్ననలు పొందుతూనే ఉన్నాయి. వారికి అనుగుణంగా ఆ ఉత్పత్తులకు మార్పులు చేర్పులు చేసి లేటెస్ట్ ఎడిషన్‌లో మళ్లీ మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది.

మారుతి సుజుకి తమ బెస్ట్ సెల్లింగ్ వ్యాగన్ ఆర్‌ను అప్‌డేట్ చేసి 2017 నాటికి దేశీయంగా అందుబాటులోకి తీసుకురావాలాని నిర్ణయించుకుంది.

మారుతి తమ తొలి వ్యాగన్ ఆర్ ని 19991 పరిచయం చేసింది. ప్రస్తుతం మార్పులతో మన ముందుకు రానున్న వ్యాగన్ ఆర్ మూడవ తరానికి చెందినది. దీనిని 2017 మలి సగంలో లేదా 2017 చివరి నాటికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

మారుతి వ్యాగన్ ఆర్ కు గల బాడీ డిజైన్ మార్కెట్లో మరే ఉత్పత్తికి లేదు. విశాలమైన బాడీ కలిగి ఉండటమే దీని సక్సెస్ కారణం. అందుకోసం త్వరలో రానున్న వ్యాగన్ ఆర్ లో కూడా ఇదే తరహా బాడీని అందివ్వనున్నారు.

కొత్తగా చోటు చేసుకుంటున్న మార్పులలో కొత్తగా డిజైన్ చేయబడిన బంపర్లు, హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ మరియు మునుపటి వ్యాగన్ ఆర్ తో పోల్చితే విభిన్నంగా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి.

మారుతి తమ ఈ వ్యాగన్ ఆర్ లో సాంకేతిక మార్పులు చేయడానికి కూడా సిద్దమయ్యింది. అందులో ముఖ్యంగా 1.0-లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వనున్నారు.

ఇందులో అందివ్వనున్న ఇంజన్ సుమారుగా 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని శక్తివంతమైన కె సిరీస్ పెట్రోల్ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను కూడా అనుసంధానం చేయనున్నారు.

ప్రస్తుతం దేశీయ విపణిలో ఉన్న ఉత్పత్తులకు గట్టి పోటీని ఇవ్వగలిగే విధంగా సుమారుగా 4 లక్షల రుపాయల ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.

2017 మారుతి వ్యాగన్ ఆర్ దేశీయ మార్కెట్లోకి విడుదలయితే డాట్సన్ గో, షెవర్లే బీట్ మరియు హ్యుందాయ్ ఐ10 వంటి ఉత్పత్తులకు పోటీగా నిలవనుంది.

- ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం....?
- పాకిస్తాన్ సరిహద్దు గేటును స్కార్పియోతో బద్దలు కొట్టిన భారతీయుడు
- 85,000 రుపాయల వరకు ఆఫర్లు ప్రకటించిన ఫియట్


Click it and Unblock the Notifications








