మినీ కన్వర్టిబుల్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన మిని ఇండియా
మినీ ఇండియా దేశీయ మార్కెట్లోకి సరికొత్త మినీ క్వర్టిబుల్ కారును నేడు విడుదల చేసింది. ఖరీదైన్ హాట్ హ్యాచ్‌బ్యాక్‌లలోకి విడుదలైన దీని ప్రారంభ ధర రూ. 34.9 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది. మినీ కన్వర్టిబుల్ గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మినీ కన్వర్టిబుల్ ఇంజన్ వివరాలు
మినీ కూపర్ ఎస్ లోని 2.0-లీటర్ టర్భో ఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఈ సరికొత్త మినీ కన్వర్టిబుల్ హ్యాచ్‌బ్యాక్‌లో అందించారు.

పవర్ వివరాలు
ఇందులోని శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 189 బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వేగం
ఈ సరికొత్త మినీ కన్వర్టిబుల్ కారు కేవలం 7.1 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 233 కిలోమీటర్లుగా ఉంది.

ట్రాన్స్‌మిషన్
మినీ కన్వర్టిబుల్ విడుదల అయ్యే ఇంజన్ పవర్ మొత్తం 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ముందు వైపు చక్రాలకు అందజేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఇది 6-ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో కూడా అందుబాటులో ఉండనుంది.

ఫీచర్లు
మినీ కన్వర్టిబుల్ కారులో ఆటో స్టార్ట్/స్టాప్ సిస్టమ్ మరియు శక్తిని పునరుత్పత్తి చేసే బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో కలదు.

మైలేజ్
మినీ వారి మినీ కన్వర్టిబుల్ కారు లీటర్‌కు 14.59 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

టాప్ తెరుచుకోవడం
మినీ కన్వర్టిబుల్ కారు టాప్ మొత్తం కేవలం 18 సెంకండ్ల వ్యవధిలోనే ముడుచుకుంటుంది. మరియు మునుపటి జనరేషన్ మోడల్ కన్నా ఇది 25 శాతం ఎక్కువగా 215 బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

ఆప్షనల్ ఫీచర్లు
8.8-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, హార్మన్ వారి కార్డన్ హై-ఫై ఆడియో సిస్టమ్ మరియు హెడ్స్ అప్ డిస్ల్పే కలదు.

లభించు రంగులు
- కార్బియన్ అక్వా
- మెల్టింగ్ సిల్వర్
- మూన్ వాక్ గ్రే
- బ్లేజింగ్ రెడ్
- బ్రిటిష్ రేజింగ్ రెడ్
- ఐస్డ్ చాకోలెట్
- మిడ్ నైట్ బ్లాక్
- డీప్ బ్లూ
- వైట్ సిల్వర్
- థండర్ గ్రే
- ల్యాపిస్‌లగ్జరీ బ్లూ
- ముందు మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగులు
- బ్రేక్ అసిస్ట్
- మూడు పాయింట్లు గల సీట్ బెల్ట్
- డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్
- క్రాష్ సెన్సార్స్
- యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
- కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్
- రన్-ఫ్లాట్ ఇండికేటర్
- ఇండియన్ మార్కెట్లో సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉన్న టాప్-10 కార్లు

భద్రత ఫీచర్లు



Click it and Unblock the Notifications








