పెద్ద నానో పెలికాన్ టెస్టింగ్: విడుదల, విశిష్టతలేమి ?

By Anil

దేశీయ మార్కెట్లో అత్యంత సరసమైన కారు టాటా నానో అని అందరికీ తెలిసిందే. అయితే టాటా ఈ నానోను మరింత అభివృద్ది చేసి పెలికాన్ రూపంలో అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి రహస్యంగా టెస్టింగ్ నిర్వహిస్తున్న వేళ కెమెరా కంటికి చిక్కింది.

గతంలో అందుబాటులోకి తీసుకువచ్చిన నానో జెన్ఎక్స్ కన్నా ఈ పెల్లికాన్ డిజైన్ మరియు సామర్థ్యం పరంగా నాలుగు ఎక్కువ మార్కులే తెచ్చుకోనుంది.

టాటా నానో పెల్లికాన్

పరీక్షలపుడు కెమెరా కంటికి చెందిన ఫోటోలను పరిశీలిస్తే ఇందులో సరికొత్తగా తీర్చిదిద్దిన రీ డిజైన్డ్ హెడ్ ల్యాంప్ క్లస్టర్‌ను గుర్తించవచ్చు.

టాటా నానో పెల్లికాన్

అంతే కాకుండా మునుపటి నానో జెన్ఎక్స్‌తో పోల్చుకుంటే కాస్తంత విభిన్నంగా ఉండటం కోసం మొత్తం బాడీ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేశారు.

టాటా నానో పెల్లికాన్

అంతే కాకుండా ముందు మరియు వెనుక వైపు బంపర్ డిజైన్‌లో టాటా మోటార్స్ ప్రత్యేక శ్రద్ద వహించింది. మార్కెట్లోకి పరిచయం చేసే నాటికి డిజైన్‌లో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

టాటా నానో పెల్లికాన్

కొన్ని రిపోర్ట్‌లు తెలిపిన వివరాల మేరకు టాటా మోటార్స్ ఈ నానో పెల్లికాన్‌లో ప్రస్తుతం ఉన్న ఇంజన్‌లను అందిస్తూనే పెద్ద ఇంజన్‌ను అందించే అవకాశం ఉంది.

టాటా నానో పెల్లికాన్

ఇందులోని రెండు ఇంజన్‌లకు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు గేర్‌బాక్స్‌లను అనుసంధానం చేసే అవకాశాలు ఉన్నాయి.

టాటా నానో పెల్లికాన్

రహస్య పరీక్షలకు గురైన టాటా నానో కారులో 13-అంగుళాల వీల్స్, ఇందనాన్ని నింపే మూతను వెనుక వైపున అందించారు.

టాటా నానో పెల్లికాన్

టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో వినియోగించిన డ్యాష్‌బోర్డ్‌ తరహాలోనే ఈ నానో పెల్లికాన్‌లో పరిచయం చేయనున్నారు. మధ్య బాగంలో ఉన్న స్పీడో మీటర్‌ను స్టీరింగ్ వీల్ ప్రక్క వైపుకు మార్చేశారు.

టాటా నానో పెల్లికాన్

తరువాత తరం టాటా నానో 2017 నాటికి మార్కెట్లోకి విడుదల కానుంది. సరైన ధర మరియు ఫీచర్లతో రానున్న ఇది ప్రస్తుతం ఉన్న నానో జెన్ఎక్స్ స్థానంలోకి బదిలీ కానుంది.

టాటా నానో పెల్లికాన్

దేశీయ మార్కెట్లోకి పరిచయం కానున్న ఈ నానో పెలికాన్ డాట్సన్ రెడి గో, రెనో క్విడ్, మరియు మారుతి ఆల్టో 800 మోడళ్లకు పోటీగా నిలవనుంది.

Via Vahanpurchase

టాటా నానో పెల్లికాన్

  • మారుతి సుజుకి అప్ కమింగ్ ప్రీమియమ్ హ్యాచ్ గురించి ముఖ్యమైన విషయాలు
  • డాట్సన్ రెడి గో స్పోర్ట్ విడుదల: ప్రారంభ ధర రూ. 3.49 లక్షలు

More from DriveSpark

Article Published On: Friday, September 30, 2016, 10:43 [IST]
English summary
Tata Motors Planning To Launch All-New Nano, Spied Testing
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+