అత్యంత సరసమైన ధరతో సరికొత్త టయోటా ఎటియోస్ విడుదల
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ దేశీయ విపణిలోకి తమ సరికొత్త ఎటియోస్ ప్లాటినమ్ కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేసింది.
సరికొత్త ప్లాటినమ్ ఎటియోస్ కార్లు దేశవ్యాప్తంగా ఉన్న టయోటా డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాటినమ్ ఎటియోస్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది.

ధర వివరాలు
- స్టాండర్డ్ ఎటియోస్ ప్లాటినమ్ (పెట్రోల్) ధర రూ. 6.43 లక్షలు
- స్టాండర్డ్ ఎటియోస్ ప్లాటినమ్ (డీజల్ ) ధర రూ. 7.56 లక్షలు
- డిఎల్ఎక్స్ ఎటియోస్ ప్లాటినమ్ (పెట్రోల్) ధర రూ. 6.83 లక్షలు
- డిఎల్ఎక్స్ ఎటియోస్ ప్లాటినమ్ (డీజల్) ధర రూ. 7.96 లక్షలు
- హై ఎటియోస్ ప్లాటినమ్ (పెట్రోల్) ధర రూ. 7.17 లక్షలు
- హై ఎటియోస్ ప్లాటినమ్ (డీజల్) ధర రూ. 8.30 లక్షలు
- ప్రీమియమ్ ఎటియోస్ ప్లాటినమ్ (పెట్రోల్) ధర రూ. 7.74 లక్షలు
- ప్రీమియమ్ ఎటియోస్ ప్లాటినమ్ (డీజల్) ధర రూ. 8.87 లక్షలు గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- హైదరబాదీ ఖాకీల చేతికి ఈడర్ మోటార్ సైకిల్స్ ఛైర్మెన్


టయోటా మోటార్స్ తమ మునుపటి ఎటియోస్ కాంపాక్ట్ సెడాన్ ఉత్పత్తులను ఎటియోస్ ప్లాటినమ్ అనే పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి అన్ని ధరలు కూడా మునుపటి ఎటియోస్‌లతో పోల్చుకుంటే సుమారుగా 20,000 రుపాయల వరకు తక్కువగా ఉన్నాయి.

ఈ సరికొత్త టయోటా ఎటియోస్ ప్లాటినమ్ కాంపాక్ట్ సెడాన్‌లలో అవే 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌లను కలిగి ఉంది. రెండు ఇంజన్‌లకు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఈ సరికొత్త టయోటా ఎటియోస్ ప్లాటినమ్ కాంపాక్ట్ సెడాన్‌లలో అవే 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌లను కలిగి ఉంది. రెండు ఇంజన్‌లకు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

క్రితం ఎటియోస్‌తో డిజైన్ పరంగా పోల్చుకుంటే దీని ముందు వైపు బంపర్ మరియు షార్ప్ డిజైన్ లక్షణాల ద్వారా ఎంతో అగ్రెసివ్‌గా ఉంటుంది.

స్పోర్టివ్ రూపంలో ఉండే ఎటియోస్ ప్లాటినమ్‌లో సరికొత్త స్పోర్టివ్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు. వెనుక వైపు డిజైన్‌లో మరియు టెయిల్ ల్యాంప్స్ లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

ఇంటీరియర్‌లోని డ్రైవర్ విభాగానికి వస్తే, అభివృద్ది పరచబడిన స్పీడో మీటర్, ట్యాకో మీటర్ లను మధ్యలో డిజైన్ చేశారు. మరియు తక్కువ వేగంలో ఉన్నపుడు ఇంజన్ విడుదల చేసే శబ్దాన్ని క్యాబిన్‌లోకి రాకుండా ఉండేందుకు టయోటా ఇంజనీర్లు దీని క్యాబిన్‌ను చక్కగా డిజైన్ చేశారు.

కారు ఇన్సూరెన్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు... పూర్తిగా వినియోగదారుల లాభదాయకమైన ఈ విధానం గురించి పూర్తి వివరాలు...



Click it and Unblock the Notifications








