మళ్లీ పుట్టిన నూతనత్వం: టయోటా క్రిస్టా వర్సెస్ టయోటా ఇన్నోవా

By Anil

నూతన తరానికి సరికొత్త రూపం తమ టయోటా క్రిస్టా ఎమ్‍‌‌పివి అంటోంది టయోటా మోటార్స్ సంస్థ. టయోటా సంస్థ మార్కెట్లోకి ఇన్నోవా విడుదల అయిన సమయం నుండి భారీ స్థాయిలో అమ్మకాలు సాధించుకుంటూ వస్తోంది. అయితే భారతీయ వినియోగదారులకు సరికొత్త రుచిని చూపించడానికి టయోటా ఇన్నోవా స్థానంలో క్రిస్టా ఎమ్‌పివి వాహనాన్ని విడుదల చేసింది.

అయితే సరికొత్త క్రిస్టా మరియు మొదటి తరం ఇన్నోవా వాహనాల మధ్య ఎటువంటి మార్పులుచోటు చేసుకున్నాయి. ఇన్నోవా మరియు క్రిస్టా మధ్య గల తేడాలను క్రింది ద్వారా అందిస్తున్నాము. ఇన్నోవా లేదా క్రిస్టా లలో ఏది ఉత్తమమైనదో చూద్దాం రండి.

డిజైన్

డిజైన్

టయోటా మోటార్స్ తమ మొదటి తరం ఇన్నోవాతో పోల్చితే రెండవ తరం ఇన్నోవాగా పిలవబడే క్రిస్టా కారు ముందు వైపు డిజైన్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. స్పోర్టివ్‌గా ఉన్న సరికొత్త ఫ్రంట్ గ్రిల్ హెక్సాగోనల్ ఆకారంలో కలదు. మరియు మునుపటి హెడ్ లైట్ల కన్నా ప్రత్యేకమైన నూతన ఆకారంలో రూపొందించారు.

టయోటా క్రిస్టా వర్సెస్ టయోటా ఇన్నోవా

ఫ్రంట్ ఫాసికాగా పిలువబడే ముందు వైపున ఒక ప్రక్కగా ఉండే హెడ్ లైట్లను చక్కగా ఒక మూలకు ఉండే విధంగా అమర్చారు. మరియు బంపర్‌కు క్రింది వైపున రెండు వైపులా కూడా ఫాగ్ ల్యాంపులను డిజైన్ చేసారు. మీరు ఇక్కడ గమనించారంటే ఫాగ్ ల్యాంప్‌లకు ప్రక్క వైపున ఎల్‍‌‌ఇడి లైట్లను అమర్చారు.

వెనుక వైపు డిజైన్

వెనుక వైపు డిజైన్

టయోటా మోటార్స్ ఈ నూతన తరం క్రిస్టా ఎమ్‍‌పివిలో ముందు వైపు డిజైన్‌తో పాటు వెనుక వైపు డిజైన్‌కు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వెనుక వైపు డిజైన్‌లో సరికొత్త టెయిల్ ల్యాంప్స్ కలవు. ప్రక్కవైపుల గమనిస్తే 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ కలవు.

టయోటా ఇన్నోవా

టయోటా ఇన్నోవా

ఇంత వరకు క్రిస్టా గురించి చూశాము కదా ఇప్పుడు ఇన్నోవా గురించి చూద్దాం రండి: ఇన్నోవా ముందు వైపు డిజైన్‌లో స్టన్నింగ్ స్పోర్ట్ ఫ్రంట్ గ్రిల్ కలదు, ఈ గ్రిల్ మీద అధిక శాతం క్రోమ్ పూత పూయబడి ఉంది.

టయోటా క్రిస్టా ఇంజన్ వివరాలు

టయోటా క్రిస్టా ఇంజన్ వివరాలు

టయోటా క్రిస్టా 2.4-లీటర్ కెడి సిరీస్ టర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 3,400 ఆర్‌పిఎమ్ వద్ద 147 బిహెచ్‌‌పి పవర్ మరియు 1,200 నుండి 2,800 ఆర్‌పిఎమ్ వద్ద 359 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్ వివరాలు

ట్రాన్స్‌మిషన్ వివరాలు

టయోటా క్రిస్టా లోని అత్యంత శక్తివంతమైన ఇంజన్ విడుదల చేసే పవర్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా చక్రాలకు అందజేస్తుంది.

టయోటా ఇన్నోవా ఇంజన్ వివరాలు

టయోటా ఇన్నోవా ఇంజన్ వివరాలు

టయోటా వారి మొదటి తరం ఇన్నోవా వాహనంలో 2.5-లీటర్ కెపాసిటి గల కెడి సిరీస్ టర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది 3,600 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పి పవర్ మరియు 1.200 నుండి 3,600 ఆర్‌పిఎమ్ మధ్య 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్ వివరాలు

ట్రాన్స్‌మిషన్ వివరాలు

టయోటా మోటార్స్ వారి ఇన్నోవా వాహనంలో గల శక్తివంతమైన ఇంజన్ విడుదల చేయు పవర్ మరియు టార్క్‌ను చక్రాలకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా అందుతుంది.

టయోటా క్రిస్టా ఫీచర్లు

టయోటా క్రిస్టా ఫీచర్లు

  • సరికొత్త డిజైన్ గల ఛాసిస్
  • హిల్-స్టార్ట్ అసిస్ట్
  • కీ లెస్ ఎంట్రీ
  • పుష్ బటన్ స్టార్/స్టాప్
  • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
  • 8-అంగుళాల తాకే తెర పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్
  • 8 మరియు 7 సీట్ల సామర్థ్యం గల క్యాబిన్ డిజైన్
  • టయోటా ఇన్నోవా ఫీచర్లు

    టయోటా ఇన్నోవా ఫీచర్లు

    • 8-సీట్ల సామర్థ్యం గల క్యాబిన్
    • క్యాప్టెన్ సీటు( ప్రక్కన గల ఫోటోలోని మధ్య వరుసలో గల సీటును క్యాప్టెన్ సీటు అంటారు)
    • రెండవ మరియు మూడవ వరుసల కోసం ఏ/సి ఎయిర్ వెంట్
    • తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ
    • క్రిస్టాలోని భద్రత ఫీచర్లు

      క్రిస్టాలోని భద్రత ఫీచర్లు

      స్టాండర్డ్ వేరింట్లో రెండు ఎయిర్ బ్యాగులు మరియు అన్ని వేరియంట్లలో కూడా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ సిస్టమ్. అంతే కాకుండా ఇందులో ఎస్‌యువి ఫీచర్లు అయిన హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు ఆరు ఎయిర్ బ్యాగులు వంటివి కలవు.

      ఇన్నోవా లోని ఫీచర్లు

      ఇన్నోవా లోని ఫీచర్లు

      పాత ఇన్నోవా వాహనంలో రెండు ఎయిర్ బ్యాగులు మరియు టాప్ వేరియంట్లలో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు స్టాండర్డ్ వేరియంట్లలో ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు కలవు.

      ధర వివరాలు

      ధర వివరాలు

      సరికొత్త టయోటా క్రిస్టా ఎమ్‌పివి ధర సుమారుగా 11 నుండి 12 లక్షలు ఎక్స్ షోరూమ్ గా ఉండనుంది. అధే విదంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టయోటా ఇన్నోవా వాహనం ధర సుమారుగా 11.18 నుండి 16.48 లక్షల వరకు కలదు.

      తీర్పు

      తీర్పు

      టయోటా వారి ప్రస్తుత క్రిస్టా ఎమ్‌పివి వాహనం పరంగా చూస్తే నిజానికి ఇది ఎమ్‌పి‌విల రంగంలో ఖచ్చితంగా విప్లం సృష్టస్తుంది, దీని పోటి దారులకు మరితం చెమటలు పుట్టిస్తుంది. ఒక్క విషయంలో చెప్పాలంటే భవిష్యత్ ఎమ్‌పివికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అనవచ్చు.

      టయోటా క్రిస్టా వర్సెస్ టయోటా ఇన్నోవా

      టయోటా ఇన్నోవా విషయానికొస్తే ధర, ఇంజన్, సేల్స్ మరియు వాణిజ్యం పరంగా దీనికంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. అయితే ఇప్పటి వరకు ఇది మంచి అమ్మకాలనే నమోదు చేసుకుంటోంది. అయితే టయోటా మోటార్స్ వారు ఇన్నోవాను మార్కెట్లో నుండి తొలగించి దీని స్థానంలోకి క్రిస్టా వాహనాన్ని ప్రవేశపెడుతున్నారు. అంటే ఇక మీదట మీరు ఇన్నోవాను కొనలేరన్నమాట.

      మరిన్ని కథనాల కోసం....
      • నిన్న కాక మొన్న వచ్చింది, మారుతి సుజుకి డిజైర్‌ను పడగొట్టింది
      • జెస్ట్ వర్సెస్ డిజైర్: ఎమ్‌టి సెడాన్ కార్ల మద్య ముదిరిన పోటి
      • క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి వర్సెస్ ఆల్టో కె10 ఏఎమ్‌టి: ఇక్కడ క్లిక్ చేయండి

Article Published On: Friday, March 18, 2016, 10:45 [IST]
English summary
Innovation Born Again: Comparing The New Toyota Innova Crysta With The Old
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+