ఆటో ఎక్స్ పోలో పోటికి సిద్దమైన సరికొత్త టయోటా ఇన్నోవా

By Anil

టయోటా మోటార్స్ వారు మొదటి సారిగా 2009 లో ఈ ఇన్నోవా ఎమ్‌పివి కారును మార్కెట్లోకి విడుదల చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు విపరీతమైన అమ్మకాలు నమోదు చేసుకుంటోంది. జపాన్‌కు చెందిన ఈ టయోటా సంస్థ దేశీయ మార్కెట్లోకి కొన్ని మార్పులు, చేర్పులు చేయబడిన ఇన్నోవా కారును విడుదల చేయనుంది. అందులో భాగంగానే 2016 ఆటో ఎక్స్ పోలో దీనిని ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

 టయోటా ఇన్నోవా

టయోటా ఇన్నోవా ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫోటోలు:

2016 మోడల్ గా పిలువబడే ఈ ఇన్నోవా సరికొత్త 2.4-లీటర్ డీజల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది దాదాపుగా 147 బిహెచ్‌పి పవర్ మరియు 342.25 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది.
Also Read: భారతీయ మార్కెట్లోకి ఎండీవర్‌ను విడుదల చేసిన ఫోర్డ్ ధర రూ. 24.75 లక్షలు

టయోటా ఇన్నోవా ప్రస్తుతం చాలా గట్టి పోటోనే ఎదుర్కుంటోంది. అందుకోసం దీని ఇంటీరియర్‌‌లో చాలా వరకు కొత్త ఫీచర్లను అందించినట్లు తెలుస్తోంది. మరియు దీనిని బయటి నుండి చూడటానికి స్పోర్టివ్ గా డిజైన్ చేశారు.
Also Read: గత నెలలో ఎక్కువ మంది భారతీయులు ఎంచుకున్న కార్లు

ప్రస్తుతం టయోటా ఇన్నోవా ప్రారంభ వేరియంట్ ధర రూ. 10.48 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 16.01 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్) గా ఉన్నాయి. అయితే నూతన మార్పులతో రానున్న ఈ ఇన్నోవా కొంచెం ఎక్కువ ధరతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Article Published On: Friday, January 22, 2016, 10:12 [IST]
English summary
New Toyota Innova Set For Indian Debut At 2016 Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+