సరికొత్త ఇన్నోవా కారును క్రిస్టా అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేయనున్న టయోటా
టయోటా మోటార్స్ ఇండియా వారు దేశీయ మార్కెట్లోకి సరికొత్త మల్టీ పర్పస్ వెహికల్(ఎమ్‌పివి) అతి త్వరలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే రెండు దేశాలలో విడుదల అయిన ఈ ఎమ్‌పివి అతి త్వరలో జరగబోయే 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో ద్వారా మార్కెట్లోకి రానుంది.

టయోటా మోటార్స్ వారు ఈ క్రిస్టా కారులో 2.4-లీటర్ డీజల్ ఇంజన్‌ను అందించారు. ఇది దాదాపుగా 147 బిహెపి పవర్ మరియు 242.25 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2016 కు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అందించారు.
క్రిస్టా పేరుతో మన ముందుకు వస్తున్నఈ కారు అచ్చం ఇన్నోవాను పోలి ఉంటుంది. అయితే ఎక్ట్సీరియర్‌లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే ఇంటీరయర్ చాలా వరకు మార్పులతో రానుంది. జపాన్‌కు చెందిన ఈ టయోటా మోటార్స్ వారు 2016 ఇన్నోవా ఎమ్‌పివి ద్వారా తిరుగులేని అమ్మకాలు సాధించవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టయోటా మోటార్స్ వారు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంచిన ఇన్నోవా ధర దాదాపుగా 10.48 లక్షల నుండి 16.01 లక్షల మధ్య ఉండనుంది. అయితే క్రిస్టా అనే పేరుతో వస్తున్న ఈ నయా ఇన్నోవా ధర ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.
Also Read: 1964 నుండి 2016 వరకు ఏడాదికి ఒకటి చెప్పున 48 ఫోర్డ్ మస్టాంగ్ కార్లను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన పోర్డ్: ఫోటోలు


Click it and Unblock the Notifications




























