జూన్‌లో భారతీయ రోడ్లను తాకనున్న నాలుగు కొత్త కార్లు
ఇండియన్ ఆటో మొబైల్స్ రంగం ప్రతి ఏడాది కొత్త కార్లకు స్వాగతం పలుకుతూనే ఉంది. ఇప్పుడు ఏడాదికి కొన్ని కాదు, ప్రతి మాసానికి కొన్ని కొత్త కార్లు విడుదల అవుతున్నాయి. జూన్ ప్రారంభం అనగానే నాలుగు సంస్థలు తమ కొత్త కార్లను ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించేశాయి. జూన్ నెలలో విడుదలకు సిద్దమైన కార్ల వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మెర్సిడెస్ బెంజ్
మెర్సిడెస్ బెంజ్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి తమ పాపులర్ వాహనాలను అందివ్వడం అస్సలు మానలేదు. మెర్సిడెస్ బెంజ్ తమ సరికొత్త జిఎల్‌సి ఎస్‌యువి కారును జూన్ 2, 2016 న విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

జిఎల్‌సి ఎస్‌యువి
మెర్సిడెస్ బెంజ్ సంస్థ ఈ జిఎల్‌సిఎస్‌యువిలో 2.0 లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్‌తకు 9జి-ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. మెర్సిడెస్ బెంజ్ వారి జిఎల్‌సి కారు ధర సుమారుగా రూ. 35 నుండి 45 లక్షలు (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండనుంది.

డాట్సన్
జపాన్‌కు చెందిన చిన్న కార్ల తయారీ సంస్థ డాట్సన్ ఇండియన్ మార్కెట్లోకి జూన్ 7, 2016 న తమ రెడి గో కారును విడుదల చేయనుంది. ఇండియన్ మార్కెట్లోకి డాట్సన్ వారి ఇది మూడవ ఉత్పత్తి.

రెడి గో
రెడి గో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారులో 0.8 లీటర్ (800సీసీ) సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఇది మార్కెట్లోకి విడుదల అయితే మారుతి సుజుకి ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్ మరియు రెనో క్విడ్ వంటి వాటికి పోటీగా నిలవనుంది. దీని ధర కూడా పోటీదారుల కార్ల యొక్క ధరల స్థాయిలో ఉండనున్నాయి.
విడుదలకు ముందుగా డాట్సన్ రెడి-గో కారును మా బృందం టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది వాటి వివరాలు తెలుసుకోండి.

వోక్స్‌వ్యాగన్
79 సంవత్సరాల క్రితం జర్మనీలో ప్రారంభమైన ఆటోమోటివ్ సంస్థ వోక్స్‌వ్యాగన్ మొదటి సారిగా దేశీయంగా అభివృద్ది పరిచిన ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురానుంది. వోక్స్‌వ్యాగన్ కుటుంబంలో అమియో అనే పేరుతో రానున్న మొదటి కాంపాక్ట్ సెడాన్ కూడా ఇదే. దీనిని జూన్ మధ్యలో విడుదల చేయనున్నారు.

వోక్సవ్యాగన్ అమియో
వోక్స్‌వ్యాగన్ ఈ అమియో కాంపాక్ట్ సెడాన్ కారులో సరికొత్త పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌న అందించనుంది. దీని ప్రారంభ వేరియంట్ ధర సుమారుగా రూ. 5 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉంటుందని మేము భావిస్తున్నాము.

టాటా మోటార్స్
టాటా మోటార్స్ జూన్ చివరినాటికి ఇండియన్ మార్కెట్లోకి హెక్సా మోడల్ ఎస్‌యువిని అందుబాటులోకి తీసుకురానుంది. టాటా మోటార్స్ ఈ హెక్సా ఎస్‌యువిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదక మీద పరిచయం చేశారు.

టాటా హెక్సా
టాటా మోటార్స్ ఈ హెక్సా లో 2.2 లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లను ఆప్షనల్‌గా అందివ్వనున్నారు. టాటా మోటార్స్ ఈ హెక్సా ఎస్‌యువిని 12.5 నుండి 17.5 లక్షలు మధ్య ఎక్స్ షోరూమ్‌గా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
టాటా హెక్సా గురించి మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు.

దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఐదు కొత్త కార్ల సంస్థలు
సమర్థవంతమైన దాడి చేయగల ప్రపంచ టాప్ 10 సైనిక హెలికాప్టర్లు


Click it and Unblock the Notifications








