యస్-క్రాస్ మీద 5.5 లక్షల రుపాయలు డిస్కౌంట్ ప్రకటించిన నెక్సా షోరూమ్ డీలర్లు
మారుతి సుజుకిలోని కొన్ని మోడల్స్‌ను మాత్రమే అందుబాటులో ఉంచిన నెక్సా షోరూమ్ డీలర్స్ వారు మారుతి సుజుకి యొక్క ఎస్-క్రాస్ ఎస్యువి కారు మీద దాదాపుగా 5.5 లక్షల రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించారు. మరెందుకు అలస్యం క్రింద గల ఫోటోలను చూడండి నచ్చితే ఓ కారును బుక్ చేసేయండి.

నెక్సా డీలర్స్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న తమ షోరూమ్‌లలో యస్-క్రాస్ మరియు బాలెనో కార్లను అందుబాటులో ఉంచింది. అయితే ఉన్నట్లుండి ఇంతటి భారీ మొత్తంలో ఆఫర్ ప్రకటించడం పట్ల వాహన మార్కెట్ నిపుణులు ఆలోచనలో పడ్డారు. కాని అమ్మకాలు స్తంభించిపోయి, షోరూమ్ లలో స్టాక్ ఎక్కువగా నిలిచిపోవడం వలన ఇలా ఆఫర్ ప్రకటించినట్లు తెలిసింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.6-లీటర్ డిడిఐఎస్ 320 ఇంజన్ గల కారు మీద ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. మారుతి సుజుకి యస్-క్రాస్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 16.74 లక్షలు ఆన్-రోడ్ (ముంబాయ్) గా ఉంది. మీ నగరంలో మీకు నచ్చిన మారుతి సుజుకి కారు ధరలను తెలుకోండి.
Also Read: రహస్యంగా లీక్ అయిన టివిఎస్ అపాచే ఆర్టిఆర్ 200 ఫోటోలు


Click it and Unblock the Notifications

































