హ్యుందాయ్ ఎలంట్రా రహస్య పరీక్షల వివరాలు
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తమ తరువాత తరానికి చెందిన ఎలంట్రా కారు అత్యంత గూఢ చర్యంగా పరీక్షలు నిర్వహించింది.

హ్యుందాయ్ మోటార్స్ ఈ ఆరవ తరానికి చెందిన ఎలంట్రా కారును దక్షిణ కొరియాలో 2015 చివరిలో విడుదల చేసింది. దేశీయంగా సెడాన్ సెగ్మెంట్లోకి ఇది విడుదల కానుంది.
ప్రస్తుతం ఇండియనో రోడ్ల మీద దీనికి నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి డిజైన్ వివరాలు లభించలేదు. దీనికి పూర్తిగా నల్లటి లేబుళ్లతో కప్పివేసి రహదారి పరీక్షలు జరిపారు. అయితే ఈ ఏడాదిలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన ఎలంట్రాను పోలి ఉండనుంది.
2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన దీని ముందు వైపు డిజైన్‌లో హెక్సా గోనల్ ఆకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, మరియు కొంచెం కోణీయంగా పగటి పూట వెలిగే లైట్లతో దీని హెడ్ ల్యాంప్స్ కలవు.

ఈ ఎలంట్రాలో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ సుమారుగా 149 బిహెచ్‌పి పవర్ మరియు 1.6 లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్ 136 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును. ఈ రెండు ఇంజన్ ఆప్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దేశీయంగా విడుదల కావచ్చు.


Click it and Unblock the Notifications
















