నాలుగవ తరం ప్రియస్ విడుదలకు సిద్దమవుతున్న టయోటా

By Anil

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఉత్పత్తి సేఫ్టీ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడానికి టయోటా మోటార్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా భద్రత కోసం టయోటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ డిజైన్ విధాన్ని అభివృద్ది చేసింది. అయితే ఈ విధానం పరంగా టయోటా తమ మొదటి ఉత్పత్తి నాలుగవ తరానికి చెందిన ప్రియస్‌ను డిజైన్ చేసింది. దీనిని అతి త్వరలో దేశీయంగా విడుదల చేయడానికి టయోటా సన్నద్దం అవుతోంది.

నాలుగవ తరం టయోటా ప్రియస్

టయోటా మోటార్స్ అభివృద్ది చేసిన అధునాతనమైన భద్రత ఫీచర్లన్నింటిని ఈ నాలుగవ తరానికి చెందిన ప్రియస్ హైబ్రిడ్ కారులో అందిస్తున్నారు.

నాలుగవ తరం టయోటా ప్రియస్

ప్రియస్‌లోని భద్రత ఫీచర్లు, టయోటా సేఫ్ సెన్స్, భద్రతను పెంచడాని కెమెరా మరియు మిల్లిమీటర్ వ్యవస్థ, ప్రి కొల్లిషన్ సిస్టమ్, ఆడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ అలర్ట్ మరియు ఆటోమేటిక్ హై బీమ్ యాక్టివేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

నాలుగవ తరం టయోటా ప్రియస్

కార్లలో రాడార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడాన్ని భారత ప్రభుత్వం కఠినమైన నియమాలను తీసుకువచ్చింది. ఇదే కారణం చేత వోల్వో మరియు మెర్సిడెస్ బెంజ్ తమ కార్లలో రాడార్ పరిజ్ఞానం లేకుండా తమ ఉత్పత్తులను ఇండియాలోకి తీసుకువస్తున్నాయి. అయితే టయోటా కూడా తమ ప్రియస్‌లో ఈ రాడార్ వ్యవస్థను తొలగించే అవకాశాలు ఉన్నాయి.

నాలుగవ తరం టయోటా ప్రియస్

ఇప్పటి వరకు ఉన్న ప్రియస్ కార్లలో ఇన్ని భద్రత ఫీచర్లు లేవు. మరియు భారీ స్థాయిలో భద్రత ఫీచర్లున్న ప్రియస్ ఈ నాలుగవ తరానికి చెందినది మాత్రమే.

నాలుగవ తరం టయోటా ప్రియస్

టయోటా మోటార్స్ ఈ నాలుగవ తరానికి చెందిన ప్రియస్‌లో 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు మరియు దీనికి అనుసంధానంగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్‌ను అందిస్తున్నారు.

నాలుగవ తరం టయోటా ప్రియస్

నాలుగవ తరానికి చెందిన ఈ ప్రియస్ లీటర్‌కు 40.8కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు మరియు మిగతా వాహనాలతో పోల్చుకుంటే ఇది అతి తక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్ వాయు ఉద్గారాలను విడుదల చేస్తుంది.

నాలుగవ తరం టయోటా ప్రియస్

టయోటా వారి కథనం ప్రకారం నాలుగవ తరానికి చెందిన ప్రియస్ మునుపటి ప్రియస్‌తో పోల్చుకుంటే సుమారుగా 25.2 శాతం శక్తివంతమైనది మరియు ఇందులో 18.2 శాతం శక్తివంతమైన డ్రైవ్‌ట్రైన్‌ను అందించారు.

నాలుగవ తరం టయోటా ప్రియస్

ధర పరంగా ఇది ప్రస్తుతం ఉన్న క్యామ్రీ హైబ్రిడ్ కన్నా ఎక్కువ ధరతో అందుబాటులోకి రానుంది. మరియు దీనిని కంప్లిట్లి బిల్ట్ యూనిట్‌గా అందుబాటులోకి తీసుకురానున్నారు. మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాల కోసం డ్రైవ్‌స్పార్క్‌ తెలుగుతో కలిసి ఉండండి. మా కథనాల మీరు అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు.

నాలుగవ తరం టయోటా ప్రియస్

  • హీరో మోటోకార్ప్ మాస్టర్ ప్లాన్: వరుసగా 15 బైకుల విడుదలకు పథకం
  • అక్కినేని నాగార్జున 57 వ పుట్టిన రోజు కానుకగా బిఎమ్‌డబ్ల్యూ

More from DriveSpark

Article Published On: Thursday, September 1, 2016, 18:47 [IST]
English summary
Toyota To Launch The Next Gen Prius In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+