నిస్సాన్ సంస్థతో చేతులు కలిపిన బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం

By Anil

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద అన్ని కూడా అందాలే అని చెప్పవచ్చు. నూతన కార్లు, కొత్త రంగులు, కొత్త డిజైన్లు, వీటికి పోటీగా కొత్త బైకులు అన్నింటితో పాటు ఎక్స్ పో లో వాహనాలను ప్రదర్శిస్తున్న అందమైన భామలు ఇలా ఒక్కటేమిటి మనసుపెట్టి చూడాలేగాని ఎన్నో మధురానుభూతులు పొందవచ్చు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ వేదిక వీటికే కాదు సినీ తారలకు కూడా నిలయంగా మారింది. ఈ వేదిక మీద ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం కనువిందు చేశాడు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడార్‌గా చేరాడు.

నిస్సాన్ జిటి-ఆర్


నిస్సాన్ ఇండియా తమ జిటి-ఆర్ మరియు ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువి రెండింటిని కూడా ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకురానుంది. అందులో భాగంగా నిస్సాన్ ఇండియా ఆటో ఎక్స్ పో వేదిక మీద రెండింటినీ ప్రదర్శించింది. వీటితో తమ వాణిజ్య ప్రకటనల భాగస్వామి జాన్ అబ్రహాం కనువిందు చేశాడు.
నిస్సాన్ ఎక్స్-ట్రయల్


నిస్సాన్ ఇండియాతో చేతులు కలిపిన తరువాత జాన్ అబ్రహాం మాట్లాడుతూ, నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్ట అందులో కార్ల అంటే మరీ మక్కువ అని తన ఇష్టాన్ని వెలిబుచ్చాడు. జిటి-ఆర్ కారు మార్కెట్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది మరియు భారతీయ మార్కెట్లోకి సరైన సమయంలో సరైన ఎక్స్- ట్రయల్ హైబ్రిడ్ కారు రంగ ప్రవేశ చేసిందని సెలవిచ్చాడు. నిస్సాన్ ఇండియాతో ప్రకటనల భాగస్వామిగా కలసి పని చేస్తున్నందుకు ఆనందా ఉందని తెలిపాడు.
Also Read: యమహా ఎమ్‌టి-09 స్ట్రీట్‌ ఫైటర్: దీనిని కొనగల సత్తా ఉందా...?
నిస్సాన్ ఇండియా 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన జిటి-ఆర్ కారు ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా అమ్మకాలకు సిద్దం కానుందని తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 9, 2016, 12:02 [IST]
English summary
Auto Expo 2016: Nissan Appoint John Abraham As Brand Ambassador
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+