2017 జిటి-ఆర్ నిస్మొను అవిష్కరించిన నిస్సాన్
నిస్సాన్ మోటార్స్ తాజాగా తమ సరికొత్త జిటి-ఆర్ సూపర్ కారును విడుదల చేసింది. జపాన్ ఆధారిత ఈ ఆటోమొబైల్ తయారీ సంస్థ 2017 జిటి-ఆర్ నిస్మొ సూపర్ కారును ఆవిష్కరించింది. జర్మనీలోని ఇకానిక్ నర్‌బర్‌గ్రింగ్ సర్క్యూట్ వద్ద ఈ 2017 నిస్సాన్ జిటి-ఆర్ నిస్మొను ప్రదర్శించింది.

ఈ నిస్సాన్ జిటి-ఆర్ నిస్మొ సూపర్ కారులో 3.8 లీటర్ సామర్థ్యం ఉన్న వి6 ట్విన్ టుర్భో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ ఊహించిన స్థాయిలో 591.39 బిహెచ్‌పి పవర్ మరియు 652 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

నిస్సాన్ జిటి-ఆర్ నిస్మొ 2017 కార్లను జపాన్‌లోని టోచిగిలో తయారు చేశారు. వీటి ఇంజన్‌లను జపాన్‌లోని యొకోహామాలో చేతితో అసెంబ్లింగ్ చేశారు.

నిస్సాన్ మోటార్స్ ఈ జిటి-ఆర్ నిస్మొ 2017 ను కేవలం ఐదు రకాల బాడీ రంగుల్లో అందించనున్నారు.

భద్రత పరంగా 2017 జిటి-ఆర్ నిస్మొ సూపర్ కారులో నిస్సాన్ అడ్వాన్స్‌డ్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్, అంతే కాకుండా ఇందులో డ్రైవర్ మరియు ప్యాసింజర్ సైడ్ ఇంపాక్ట్ అలాగే రూఫ్ మౌంటెడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగులను కల్పించారు.

2017 నిస్సాన్ జిటి-ఆర్ నిస్మొలో ప్రతి టైరుకు కూడా ప్రత్యేకంగా టైర్ ప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్‌ను అందించారు. తద్వారా ప్రత్యేకంగా ప్రతి టైరులో ఉన్న ప్రెసర్‌ను తెలుసుకోవచ్చు.

2017 నిస్సాన్ జిటి-ఆర్ నిస్మొను నిస్సాన్ జిటి-ఆర్ లోని అంశాలను సేకరించి అభివృద్ది చేశారు. మంచి పనితీరు కనబరచడానికి అధునాతన ఏరోడైనమిక్స్ శరీర భాగాలను డిజైన్ చేశారు. తద్వారా గాలి నుండి కలిగే ఘర్షణ తగ్గుతుంది.

సూపర్ కారు తీరుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో ఎక్కువగా కార్బన్ ఫైబర్ పదార్థంతో తయారైన విడిభాగాలను వినియోగించారు.

బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోను ఉన్నాయ్!: ఇక్కడ క్లిక్ చేయండి
17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ


Click it and Unblock the Notifications