నవరాత్రి స్పెషల్: గోల్డ్ కాయిన్‌లను అందిస్తున్న నిస్సాన్
దేశీయంగా జరుపుకునే నవరాత్రి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత కలదు, ఈ నవరాత్రి సందర్భంలో చాలా మంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అందులో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారు కూడా ఎక్కువే. అయితే అవకాశాన్ని సొమ్ము చేసుకోవడానికి జపాన్‌కు చెందిన నిస్సాన్ సంస్థ దేశీయంగా అందుబాటులో ఉంచిన అన్ని ఉత్పత్తుల మీద ఆఫర్లు మరియు గొప్ప తగ్గింపును ప్రకటించింది. ఇందులో కస్టమర్లకు తప్పకుండా బంగారు నాణేలు కూడా అందిస్తున్నారు.

నిస్సాన్ దేశీయంగా అందుబాటులో ఉంచిన తమ అన్ని ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా ఉన్న షోరూమ్‌ల ద్వారా సెప్టెంబర్ 30 లోపు బుక్ చేసుకునే వారు మాత్రమే నిస్సాన్ నవరాత్రి ఆఫర్లకు అర్హులు.

నిస్సాన్ ఉత్పత్తి శ్రేణిలో ఉన్న మైక్రాను బుక్ చేసుకునే వినియోగదారులకు బంగారు నాణాన్ని కూడా అందిస్తున్నారు.

నిస్సాన్ ఈ మొత్తం ఆఫర్లను రైతులకు, డాక్టర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు కార్పోరేట్ ఉద్యోగులందరికీ అందుబాటులో ఉంచింది. ఈ సెప్టెంబర్ 30 లోపు బుక్ చేసుకున్న వారి ఉత్పత్తులకు ఉచితి ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తోంది.

సుమారుగా 40,000 రుపాయల వరకు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ మరియు ఆకర్షణీయమైన 8.99 శాతం వడ్డీ రేటును కూడా అందిస్తున్నారు.

సెప్టెంబర్ 30 లోపు నిస్సాన్ టెర్రానో ఎస్‌యువిని ఎంచుకునే వారి ఖచ్చితమైన గోల్డ్ కాయిన్‌తో పాటు 40,000 రుపాయల వరకు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ మరియు అత్యంత ఆకర్షణీయమైన 8.99 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

నిస్సాన్ తమ మైక్రా ఆక్టివ్ హ్యాచ్‌బ్యాక్ మీద సుమారుగా 40,000 రుపాయల ఎక్స్‌చ్ఛేంజ్ మొత్తాన్ని అందిస్తోంది. మరియు దీనిని ఎంచుకునే వారికి డీలర్లు 8.99 శాతం వడ్డీ రేటుతో ఆకర్షణీయమైన వాయిదా పద్దతిలో చెల్లించే విధాన్ని ఆఫర్ చేస్తున్నారు.

నిస్సాన్ సన్నీ సెడాన్ మీద సుమారుగా 70,000 రుపాయల విలువైన ఆఫర్లను అందించారు. దీనిని మీద అత్యంత ఆకర్షణీయమైన 8.99 శాతం వడ్డీ రేటును కూడా అందించారు.

అయితే నిస్సాన్ తమ మైక్రా అక్టివ్ హ్యాచ్‌బ్యాక్ మరియు సన్నీ సెడాన్‌ల బుకింగ్స్ మీద ఉచిత గోల్డ్ కాయిన్‌ను అందివ్వడం లేదు.

- దీపావళికి ఇంట్రెస్టింగ్ మోడల్‌తో సిద్దమైన యమహా
- ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ట్రక్కు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో
- నిస్సాన్ ఇండియా ప్యూచర్ మైక్రా హ్యాచ్‌బ్యాక్


Click it and Unblock the Notifications








