దేశీయంగా విడుదల కానున్న నిస్సాన్ కిక్స్ వివరాలు
నిస్సాన్ ఇండియా తాజాగా తమ ఎక్స్-ట్రయల్ విడుదలను ఈ ఏడాదిలో చేయనున్నట్లు ప్రకటించిన విషయం విధితమే అయితే ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ మరిన్ని ఎస్‌యువిలను మరియు క్రాసోవర్ వాహనాలను అందివ్వాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే సరికొత్త కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యువిని దేశీయంగా విడుదల చేయాలనే ప్రయత్నంలో ఉంది నిస్సాన్ ఇండియా.

నిస్సాన్ ఇండియా ఈ కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యువి వాహనాన్ని సుమారుగా 8 నుండి 15 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ధరతో 2018 ప్రారంభ నాటికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది దేశీయ మార్కెట్లోకి విడుదల అయితే ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్ వంటి వాహనాలకు పోటీగా నిలవనుంది.
మే 2016 లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్-10 కార్లు: టాప్-10లో మారుతివే ఏడు కార్లు
నిస్సాన్ ఈ కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యువి వాహనాన్ని CMF-B (కామన్ మాడ్యుల్ ఫ్యామిలీ) వేదిక మీద అభివృద్ది చేస్తున్నారు. పిబి1డి అనే కోడ్ పేరుతో రూపం పోసుకుంటున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యువి ఈ వేదిక మీద మొదటిగా రూపొందుతున్న మోడల్ అని తెలిసింది. తాజాగా నిస్సాన్ సంస్థ ఈ కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యువిని బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఈ ఏడాది ఆగష్ట్ నాటికి అమ్మకాలకు సిద్దం చేయనుంది.
బ్రెజిల్ మార్కెట్లోకి విడుదల కానున్న ఈ కిక్స్‌లో 1.6 లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంధన రకాలో లభించనుంది. ఇందులోని ఇంజన్‌కు స్టాండర్ట్ వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆప్షనల్‌గా సివిటి (కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయనున్నారు.
ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్‌తో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న లెక్సస్
కొలతల ప్రకారం చూస్తే నిస్సాన్ కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యువి 4,295 ఎమ్ఎమ్ పొడవుతో, 1760 ఎమ్ఎమ్ వెడల్పుతో మరియు 1590 ఎమ్ఎమ్ ఎత్తుతో పాటు 2160 ఎమ్ఎమ్ వీల్‌బేస్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications
























