మరింత చౌకగా నిస్సాన్ మైక్రా ఆటోమేటిక్
నిస్సాన్ ఇండియా దేశీయ మార్కెట్లోకి అత్యంత సరసమైన ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్ కారును అందుబాటులోకి తెచ్చింది. నిస్సాన్ వారు అందుబాటులోకి తెచ్చిన మైక్రా ఆటోమేటిక్‌లో కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ అందించింది. దీనిని దేశీయంగానే తయారు చేస్తున్నట్లు ప్రకటించారు.

నిస్సాన్ మైక్రా ఆటోమేటిక్ ధరలు
- మైక్రా ఎక్స్‌ఎల్ సివిటి ధర రూ. 5.99 లక్షలు
- మైక్రా ఎక్స్‌వి సివిటి ధర రూ. 6.73 లక్షలు రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- ఇండియాలో ఉన్న వివిధ రకాల నెంబర్ ప్లేట్లు వాటి వివరణలు

ఇందులోని నిస్సాన్ సంస్థ ఇందులో ఎక్స్-ట్రానిక్ సివిటి పరిజ్ఞాన్ని అందించింది.

ఫీచర్ల పరంగా ఇందులో పుష్ బటన్ స్టార్ట్ మరియు స్టాప్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఫాలో మి హోం ల్యాంప్స్, ఆటో ఎయిర్ కండీషనింగ్, మరియు నిస్సాన్ మైక్రా సివిటిలో వెనుకవైపున ఎల్ఇడి కాంబి ల్యాంప్స్‌ను అందించారు.

రోడ్డు మీద ఉత్తమ పటిష్టత్వాన్ని కలిగి ఉండేందుకు 15 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అందించారు.

భద్రత పరంగా ఇందులో స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు బ్రేక్ అసిస్ట్. మీరు ఊహించని ఈ అన్ని ఫీచర్లు కూడా నిస్సాన్ మైక్రా సివిటిలో అందుబాటులో ఉన్నాయి.

నిస్సాన్ మైక్రా సివిటి వేరియంట్లో 1.2 లీటర్ సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 75 బిహెచ్‌పి పవర్ మరియు 104 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

నిస్సాన్ మైక్రా సివిటి మ్యాన్యువల్‌తో పోల్చుకుంటే ఆటోమేటిక్ వేరియంట్ ఉత్తమ మైలేజ్ ఇవ్వగలదు. మైక్రా సివిటిలో ఉన్న లీటర్‌కు 19.34 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు (పెట్రోల్ ఇంజన్)



Click it and Unblock the Notifications








