సరికొత్త ఆటోమేటిక్ మైక్రాను విడుదల చేసిన నిస్సాన్
నిస్సాన్ ఇండియా దేశీయ మార్కెట్లోకి తమ సరికొత్త మైక్రా ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఆశ్చర్యపరిచే హంగుల మేళవింపుతో పండుగ సీజన్‌లో వినియోగదారులను ఆకర్షించడం కోసం దీనిని మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. రానున్న రెండు నెలల్లో అతి ముఖ్యమైన పండుగలు ఉన్న నేపథ్యంలో నిస్సాన్ ఈ పథకంవేసింది.

నిస్సాన్ అందుబాటులోకి తెచ్చిన సరికొత్త మైక్రా ఆటోమేటిక్ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. అయితే నిస్సాన్ మైక్రా ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.55 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

సరికొత్త సన్‌షైన్ ఆరేంజ్ ఎక్ట్సీరియర్ రంగుతో పాటు ఇంటీరియర్‌లో బ్లాక్ పెయింట్‌తో కూడా అందుబాటులో ఉంది ఈ మైక్రా ఆటోమేటిక్. ఈ రెండు రంగుల మేళవింపుతో ఉన్న మైక్రా ఆటోమేటిక్ కార్లు దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి.

మైక్రా ఆటోమేటిక్‌లో మాత్రమే కాకుండా ఈ సన్‌షైన్ ఆరేంజ్ ఎక్ట్సీరియర్ మరియు బ్లాక్ పెయింట్ ఇంటీరియర్ మైక్రా ఆక్టివ్‌లో కూడా అందుబాటులో కలదు. ఈ ఆరెంజ్ రంగు పండుగలకు శుభ సూచకంగా ఉన్నందు వలన ఆటోమేటిక్‌ను ఈ కలర్‌లో అందించారు.

ఇంటీరియర్‌లో అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో పియానో బ్లాక్ రంగును అందించారు. సెంట్రల్ కన్సోల్ మరియు డోర్ ట్రిమ్స్ మీద పియానో బ్లాక్ రంగును గమనించవచ్చు. బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్ల కవర్లను నీలం రంగుతో అడ్డంగా కుట్టారు.

ఇక మైక్రా ఆక్టివ్ ఇంటీరియర్‌ను గమనిస్తే పూర్తి స్థాయిలో నల్లటి రంగులో ఉన్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు.

సన్‌షైన్ ఆరేంజ్‌తో పాటు నిస్సాన్ మైక్రా మరిన్ని ఐదు రంగుల్లో లభించును అవి, బ్రిక్ రెడ్, బ్లేడ్ సిల్వర్, నైట్‌షేడ్, ఆంక్సి బ్లాక్, స్టార్మ్ వైట్ మరియు టూర్‌క్వైస్ బ్లూ.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్న మైక్రా లో 1198సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 75బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఆటోమొబైల్ రంగంలో వాహన ఇన్సూరెన్స్ ఎంతో ముఖ్యం... అయితే ఎంతో కాలంగా వినియోగదారులు చాలా వరకు వెహికల్ ఇన్సూరెన్స్ చేయించుకోవడంలో మోసపోతూనే ఉన్నారు. ఈ విధానాన్ని మార్చడానికి కొత్త పద్దతి అందుబాటులోకి వచ్చింది. మరెందుకు ఆలస్యం ఇక్కడ క్లిక్ చేసి దానిని మీరు కూడా ఫాలో అవ్వండి


Click it and Unblock the Notifications








