టెర్రానో ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభించిన నిస్సాన్
నిస్సాన్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తమ షోరూమ్‌ల నుండి టెర్రానో ఆటోమేటిక్ వేరియంట్ యొక్క బుకింగ్‌లను ప్రారంభించింది. టెర్రానో ఆటోమేటిక్‍ను ఎంచుకునే వారు 25,000 రుపాయల బుకింగ్ ఋసుము చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 2016 చివరి వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి.

జపాన్‌కు చెందిన విభిన్న కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తమ టెర్రానో ఆటోమేటిక్ వేరియంట్ యొక్క ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయితే 13.75 నుండి 13.85 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ధరగా నిర్ణయించే అవకాశం ఉంది.

సాంకేతికంగా టెర్రానో ఆటోమేటిక్‌లో 1.5-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌తో రానుంది.

నిస్సాన్ లోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ సుమారుగా 108.50బిహెచ్‌పి పవర్ మరియు 248ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

సులభతరమైన డ్రైవింగ్ సౌలభ్యం కోసం ఇందులో 6-స్పీడ్ అడ్వాన్స్‌డ్ ఆటో డ్రైవ్ సిస్టమ్‌ను పరిచయం చేస్తోంది నిస్సాన్.

ఏఆర్ఏఐ వారి సమాచారం ప్రకారం నిస్సాన్ లోని డీజల్ వేరియంట్ సుమారుగా 19.61 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

నిస్సాన్ టెర్రానో ఆటోమేటిక్‌లో హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్ మరియు సుమారుగా 14 కొత్త ఫీచర్లతో విడుదల కానుంది. అతి త్వరలో నిస్సాన్ టెర్రానో ఆటోమేటిక్ మార్కెట్లోకి విడుదల కానుంది మరింత తాజా సమాచారం కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.


Click it and Unblock the Notifications








