టెర్రానో ఎస్‌యువిలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేస్తున్న నిస్సాన్
నిస్సాన్ ఇండియా దేశీయంగా అందుబాటులో ఉంచిన తమ టెర్రానో కాంపాక్ట్ ఎస్‌యువిని ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో విడుదల చేయనుంది. నిస్సాన్ ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల వేరియంట్‌ను అక్టోబర్ 2016 మధ్య భాగంలో మార్కెట్లోకి విడుదల చేయనుంది.

2016 పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నిస్సాన్ ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేయడం ద్వారా అమ్మకాల పెరుగుదలకు బాగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం నిస్సాన్ ఇండియా దేశీయ మార్కెట్లో సన్నీ మరియు మైక్రా మోడళ్లలో మాత్రమే ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పరిచయం చేసింది.

అయితే వచ్చే పండుగ సీజన్ నాటికి ఆటోమేటిక్ టెర్రానో ఎస్‌యువిని పరిచయం చేస్తాం నిస్సాన్ తన అని సామాజిక మాధ్యమాల్లో పేర్కొంది.

రెనో తమ డస్టర్‌లో ఇది వరకే ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్‌ను పరిచయం చేసింది. నిస్సాన్ మరియు రెనో భాగస్వామ్యంతో ఉన్నాయి కాబట్టి అదే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను నిస్సాన్ తమ టెర్రానోలో పరిచయం చేసే అవకాశం ఉంది.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న 1.5-లీటర్ డీజల్ ఇంజన్ సుమారుగా 109బిహెచ్‌పి పవర్ మరియు 248ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

నిస్సాన్ ఇండియా ఈ ఆటోమేటిక్ ఆప్షన్ గల టెర్రానోని విడుదల చేస్తే ధర సుమారుగా రూ. 12.50 లక్షలు ఎక్స్ షోరూమ్‍గా ఉండే అవకాశం ఉంది.

ఆటోమేటిక్ ఆప్షన్‌ని టెర్రానోలోని రెండు వేరియంట్‌లలో పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని తాజా కథనాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో అనుసంధానమై ఉండండి.

- దీపాళికి కారు కొంటే వీటిని మాత్రమే ఎంచుకోండి, ఎందుకంటే
- ఒక లక్ష మైలు రాయిని దాటిన మారుతి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్
- ఇండియన్ ఆటోమొబైల్ చరిత్రలో బిగ్ డీల్


Click it and Unblock the Notifications








