ఆటోమేటిక్ టెర్రానో విడుదలకు సన్నద్దం అవుతున్న నిస్సాన్

By Anil

చాలా వరకు కార్ల తయారీ సంస్థలు తమ విసృత శ్రేణిలో అందుబాటులో అన్ని ఉత్పత్తుల్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అందివ్వడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. అందులో రెనో సంస్థతో భాగస్వామ్యంగా ఉన్న నిస్సాన్ కూడా తమ ఉత్పత్తుల్లోని టెర్రానొలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందివ్వడానికి సిద్దమైపోయింది.

రెనో వారు తమ డస్టర్ ఎస్‌యువిని ఆర్ఎక్స్ఎల్ మరియు ఆర్ఎక్స్‌జడ్ అనే వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పరిచయం చేసింది. ఇదే వేదిక మీద తయారైన టెర్రానొలో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందివ్వడానికి నిస్సాన్ సన్నద్దమైంది.

నిస్సాన్ టెర్రానొ ఆటోమేటిక్

రెనో సంస్థ తమ ఫ్మార్ములా వన్ బృందం ఈజీ-ఆర్ అనే సాంకేతికత గల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను అభివృద్ది చేసింది. దీనిని నిస్సాన్ తమ టెర్రానొలో వినియోగించనుంది.

నిస్సాన్ టెర్రానొ ఆటోమేటిక్

ప్రస్తుతం నిస్సాన్ టెర్రానొలో పెట్రోల్ మరియు డీజల్ ఇంధన ఆప్షన్లు గల ఇంజన్‌లు ఉన్నాయి. ఈ రెండింటిలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌‌ను అందించి అతి త్వరలో విడుదల చేయనుంది.

నిస్సాన్ టెర్రానొ ఆటోమేటిక్

నిస్సాన్ టెర్రానొలో 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది సుమారుగా 103బిహెచ్‌పి పవర్ మరియు 145ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

నిస్సాన్ టెర్రానొ ఆటోమేటిక్

నిస్సాన్ తమ టెర్రానొ ఎస్‌యువిలో 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను కూడా అందించారు, ఇది సుమారుగా 84బిహెచ్‌పి పవర్ మరియు 109ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

నిస్సాన్ టెర్రానొ ఆటోమేటిక్

నిస్సాన్ తమ టెర్రానొలో ఈ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను పరిచయం చేస్తే రెండు కూడా సుమారుగా 110బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయవచ్చు. ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోవడం లేదు.

నిస్సాన్ టెర్రానొ ఆటోమేటిక్

అయితే ఫీచర్ల పరంగా ఇందులో తాకే తెర గల మ్యూజిక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యావిగేషన్ సిస్టమ్‌ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ రానున్నాయి.

నిస్సాన్ టెర్రానొ ఆటోమేటిక్

నిస్సాన్ ఈ ఆటోమేటిక్ టెర్రానొ ఎస్‌యువిని వచ్చే పండుగ సీజన్ నాటికి మార్కెట్లోకి విడుదల చేయనుంది మరియు దీని ప్రారంభ వేరియంట్ ఆటోమేటిక్ టెర్రానొ ధర సుమారుగా రూ. 13.15 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

నిస్సాన్ టెర్రానొ ఆటోమేటిక్

  • ఫ్యూచర్ మొత్తం ఎస్‌యువిలదే !! వరుసగా విడుదలకు సిద్దమైన SUVలు

More from DriveSpark

Article Published On: Tuesday, August 30, 2016, 18:22 [IST]
English summary
Nissan Terrano AMT Launch Soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+