2 కోట్ల రుపాయలు ఖరీదైన నిస్సాన్ జిటి ఆర్ కారు
నిస్సాన్ సంస్థ తమ అత్యంత ఖరీదైన జిటి ఆర్ స్పోర్ట్స్ కారును 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నిస్సాన్ వారి ఉత్పత్తులలో ఈ జిటి ఆర్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనకు సిద్దమైన నిస్సాన్ జిటి ఆర్ స్పోర్ట్స్ కారులో 3.8-లీటర్ ట్విన్ టుర్భో ఛార్జ్‌డ్ వి6 ఇంజన్ కలదు ఇది దాదాపుగా 542 బిహెచ్‌పి పవర్ మరియు 628 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
దాదాపుగా రెండు కోట్ల రుపాయల ఖరీదైన ఈ స్పోర్ట్స్ కారు కేవలం 2.8 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలో మీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు దీని అత్యధిక వేగం గంటకు 315 కిలోమీటర్లుగా ఉంది.



Click it and Unblock the Notifications

































