నిస్సాన్ ఎక్స్-ట్రయల్: భారతదేశపు మొదటి హైబ్రిడ్ ఎస్‌యువి

By Anil

జపాన్‌కు చెందిన నిస్సాన్ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి పూర్తి స్థాయి మొదటి హైబ్రిడ్ స్పోర్ట్స్ యుటిలటి వాహనాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 2016 ఏడాది చివరి నాటికి ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువిని భారతీయ రోడ్లను తాకనున్నట్లు నిస్సాన్ తెలిపింది.

కంప్లీట్లి బిల్ట్ యునిట్‌

కంప్లీట్లి బిల్ట్ యునిట్‌

నిస్సాన్ మోటార్స్ ఈ ఎక్స్-ట్రయల్‌ను పూర్తి స్థాయిలో జపాన్‌లోనే అసెంబ్లింగ్ చేసి, జపాన్‌ నుండి ఇండియాకు ఎగుమతి చేయనున్నారు.

అమెరికాలో బాగా ప్రాచుర్యం

అమెరికాలో బాగా ప్రాచుర్యం

ఈ ఎక్స్- ట్రయల్ వాహనం అమెరికన్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇండియాకు రానున్న ఎక్స్-ట్రయల్ వాహనాలు డీజల్ కన్నా పెట్రోల్ ఆప్షన్‌తోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఐదు సీటింగ్ సామర్థ్యంతో

ఐదు సీటింగ్ సామర్థ్యంతో

నిస్సాన్ వారి మునుపటి ఉత్పత్తులతో పోల్చుకుంటే ఈ ఎక్స్-ట్రయల్ వాహనం ఐదు మంది కోసం విశాలమైన సీటింగ్ లేవుట్‌ను రూపొందించారు.

డిజైన్

డిజైన్

నిస్సాన్ వారి ఎక్స్‌-ట్రయల్ వాహనం ముందు మరియు వెనుక వైపు డిజైన్ క్లియర్‌గా మరియు ఎంతో అధునాతనంగా ఉంది. అయితే ఎస్‌యువిలో హైబ్రిడ్‌ ను పరిచయం చేయడం వలన ఎక్స్‌-ట్రయల్ పేరుతో పాటు హైబ్రిడ్ అనే బ్యాడ్జితో రానుంది.

ఇంటీరియర్

ఇంటీరియర్

ఇంటీరియర్‌లోని డ్యాష్ బోర్డ్ లేవుట్ పూర్తిగా డ్రైవర్‌ అనుకూలంగా ఉండేట్లు రూపొందించారు. మరియు ఆంగ్లపు వి ఆకారంలో ఉన్న సెంటర్ కన్సోల్ కలదు. వెనుక వైపున కూర్చునే వారి కోసం కాళ్లు మరియు తల కు ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాలంగా అధిక స్పేస్‌ను కల్పించారు.

ఫీచర్లు

ఫీచర్లు

నిస్సాన్ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువిలో గుర్తించిన ఫీచర్లలో 360 డిగ్రీల కోణంలో తిరగే టచ్ స్క్రీన్ మానిటర్, వాహనాన్ని పార్కింగ్ చేయడానికి ఎస్‌యువి మీద పక్షి కన్ను ఆకారంలో ఉండేటటువంటి కెమెరా కలదు

భద్రతకు సంభందించిన అంశాలు

భద్రతకు సంభందించిన అంశాలు

ఇందులో భద్రత కోసం అధునాతనమైన యాక్టివ్ ఇంజన్ బ్రేకింగ్, యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, మరియు వెహికల్ డైనమిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించారు.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

నిస్సాన్ సంస్థ ఈ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువిలో 2.0 లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ హైబ్రిడ్ యంత్రాన్ని అందించారు. ఇది 31 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌కు అనుసంధానం చేశారు.

పవర్ మరియు ఇతర వివరాలు

పవర్ మరియు ఇతర వివరాలు

ఇందులో పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ వరుసగా 114.9 బిహెచ్‌పి మరియు 40.3బిహెచ్‍‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్‌కు డ్యూయల్ క్లచ్ ఆటోమేటిర్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ధర వివరాలు

ధర వివరాలు

ఇండియన్ మార్కెట్లోకి నిస్సాన్ ఈ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువిని విడుదల చేస్తే ప్రారంభ ధర సుమారుగా రూ. 30 లక్షల నుండి ప్రారంభ కావచ్చు.

పోటీ

పోటీ

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోకి ఎస్‌యువి సెగ్మెంట్లో హైబ్రిడ్ సాంకేతికత గల ఎటువంటి ఉత్పత్తులు లేవు. దేశీయంగా గ్లోబల్ వార్మింగ్ మరియు డీజల్ కార్ల బ్యాన్ వంటివి ఆచరణలోకి రావణం వలన భవిష్యత్తు హైబ్రిడ్ వాహనాలదే ఉంటుంది. దేశీయ మార్కెట్లోకి మొదటి హైబ్రిడ్ ఎస్‌యువిని అందిస్తున్న ఘనత నిస్సాన్‌కే దక్కుతుంది.

-

ఖచ్చితంగా నమ్మాల్సిందే, శకుంతల రైల్వేస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

More from DriveSpark

Article Published On: Thursday, June 9, 2016, 12:09 [IST]
English summary
Nissan Will Launch India’s First Fully Hybrid SUV By End Of 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+