చిన్న వాహనాలకు తప్పిన టోల్ ట్యాక్స్ భారం
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గత శనివారం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆగష్టు 15 నుండి కార్లు మరియు చిన్న చిన్న వాహనాల మీద టోల్ ట్యాక్స్ ఉండదు అని ప్రకటించారు.
గుజరాత్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఆనందిబేన్ పటేల్ గారు గత శనివారం తన ట్విట్టర్ ఖాతా నుండి " గుజరాత్‌లో చిన్న చిన్న వాహనాలు మరియు కార్ల మీద టోల్ ట్యాక్స్‌ని రద్దు చేస్తున్నట్లు, వీటికి టోల్ గేట్ వద్ద ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆగష్టు 15 నుండి ఇది అమలు కానుంది" అని తెలిపారు.

నేడు గుజరాత్‌లోని వలసాద్ జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఈమ మాట్లాడుతూ, మధ్య తరగతి కుటుంబంలో ఉన్న వారు చిన్న చిన్న వాహనాలు మరియు కార్లలో ప్రయాణిస్తున్నపుడు టోల్ గేట్ల వద్ద 100 నుండి 150 రుపాయల వరకు ఫీజ్ చెల్లించనవసరం లేదని తెలిపారు. అయితే పెద్ద వాహనాల నుండి యథావిధిగా ట్యాక్స్‌లు వసూలు చేయనున్నారు.
Also Read: ఏం చేద్దామని చైనా దీనిని సృష్టించింది
గుజరాత్‌లో దీనికి ముందు కొన్ని రాజయకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల వద్ద చిన్న వాహనాలకు టోల్ ట్యాక్స్‌ను మినహాయించాలని కోరుతూ వచ్చాయి. ముఖ్య మంత్రి తీసుకున్న నిర్ణయానికి ఆమ్‌ఆద్మీపార్టీనే కారణం అని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
Also Read: ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా వీటిని చూసి విస్తుపోయారు
ఆమ్‌ఆద్మీ పార్టీ పత్రికా సమన్వయకర్త మాట్లాడుతూ, ఎంతో కాలంగా ఆమ్‌ఆద్మీ పార్టీ చేసిన ఒత్తిడి మరియు కృషి కారణంగానే దీనిని సాధించినట్లు తెలిపారు. ఏదేమైనప్పటికీ ఆ రాష్ట్ర మధ్య తరగతి ప్రజలును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం హర్షించదగినదే.


Click it and Unblock the Notifications








