పెట్రోల్ మీద 1.42 మరియు డీజల్ మీద 2.01 రూ. లు తగ్గిన ధరలు
దేశవ్యాప్తంగా మరో సారి పెట్రోల్ మరియు డీజల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ మీద రూ. 1.42 లు మరియు లీటర్ డీజల్ మీద రూ. 2.01 లు తగ్గాయి.

ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిసర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 61.09 లుగా ఉంది. తగ్గదలకు ముందు ఇదే ధర రూ. 62.51 లు గా ఉంది. ప్రస్తుతం లీటర్ డీజల్ ధర రూ. 52.27 లుగా ఉంది. తగ్గుదలకు ముందు ఇదే ధర రూ. 54.28 లుగా ఉంది.
Also Read: అమెరికా మిలిటరీలో అత్భుతం
దేశ వ్యాప్తంగా తగ్గింపుతో సవరణ చేసిన పెట్రో ధరలు 31 జూలై అర్థ రాత్రి నుండి అమలులోకి రానున్నాయి. జూలై నెలలో వరుసగ మూడవ సారి ఇంధన ధరలు తగ్గాయి. అయితే అంతకు మునుపు రెండు నెలల పాటు ఇంధన ధరలు వరుసగా పెరిగాయి. మొత్తం పెంపులో పెట్రోల్ మీద రూ .4.52 లు మరియు డీజల్ మీద రూ. 7.72 లు పెరిగాయి. అయితే గడిచిన జూలై మాసంలో వరుసగా మూడు సార్లు ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి.
Also Read: విమానాల మీద ఆకతాయిలు వేసే లేజర్ లైట్లు ప్రయాణికులు మరియు పైలట్ల ప్రాణాలు హరిస్తున్నాయా...?
అంతర్జాతీయ చమురు ధరలు మరియు రుపాయి-డాలరుతో మారకం విలువను బట్టి ఇండియాలో ఉన్న ప్రముఖ ఇంధన సంస్థలు ప్రతి వారం కూడా పెట్రోల్ మరియు డీజల్ ధరలలో మార్పులు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








