స్వల్పంగా పెరిగిన పెట్రోల్ మరియు తగ్గిన డీజల్ ధరలు
సెప్టెంబర్ 15 రోజు చివరి నాటికి ఇంధన ధరలు కాస్త సవరణలకు గురయ్యాయి. అయితే భారీ వ్యత్యాసం లేకుండా పెట్రోల్ మీద 58 పైసలు పెంపు మరియు డీజల్ మీద 31 పైసలు తగ్గించడం జరిగింది. సవరించిన ధరలు 16 సెప్టెంబర్, 2016 తెల్లవారుజాము నుండి అందుబాటులోకి రానున్నాయి.

ఇంధన ధరల సవరణ జరిగిన తరువాత ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 64.05 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 52.63 లుగా ఉన్నాయి. దేశీయంగా ఇంధన ధరల్లో మార్పులకు కారణం అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో సవరణలు కారణం అని తెలిసింది.
Also Read: ఏ రిస్కు లేకుండా కారు భీమా చేసుకోండి.... పూర్తి వివరాలకు !!
చివరి సారిగా జరిగిన ఇంధన ధరల సవరణల్లో లీటర్ పెట్రోల్ మీద రూ. 3.38 లు మరియు లీటర్ డీజల్ మీద రూ. 2.67 లు వరకు పెరిగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








