పెట్రో ధరల్లో స్వల్ప మార్పులు
లీటర్ పెట్రోల్ పై 13 పైసలు పెంపు మరియు లీటర్ డీజల్ పై 12 పైసలు తగ్గించబడింది. కొత్త ధరలు బుధవారం అర్థరాత్రి నుండి అమ్మకాల్లోకి రానున్నాయి.
ప్రతి పదిహేను రోజులకొకసారి ఇంధన ధరల్లో సవరణలు జరుగుతున్న సంగతి తెలిసింది. ఇందులో భాగంగానే నేడు ( నవంబర్ 30, 2016) ఇంధన ధరల సవరణ జరిగింది. లీటర్ పెట్రోల్ పై 13 పైసలు పెంపు మరియు లీటర్ డీజల్ పై 12 పైసలు తగ్గించబడింది. కొత్త ధరలు బుధవారం అర్థరాత్రి నుండి అమ్మకాల్లోకి రానున్నాయి.
దీనిని కూడా చదవండి: ఎనిమిది నెలల్లో 1,72,000 బుకింగ్స్: వితారా బ్రిజా
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో సవరణలు జరిగినందున్న దేశీయ మార్కెట్లో ఇంధన ధరల్లో సవరణ జరిగినట్లు భారత దేశపు అతి పెద్ద ఇంధన రిటైల్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రో ధరల సవరణ తరువాత ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 66.10 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 52.57 లుగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications








