పెట్రోల్ మీద రూ. 3.02 తగ్గింపు మరియు డీజల్ మీద రూ. 1.47 పెంపు
కేంద్ర ప్రభుత్వం తాజా ఇంధన ధరలను కొంచెం తారు మారు చేసింది. అదేనండి లీటర్ పెట్రోల్ మీద రూ. 3.02 లు తగ్గింపు మరియు లీటర్ డీజల్ మీద రూ. 1.47 లు పెంపును ప్రకటించింది. తాజాగా ఈ ధరలు మార్చి 1, 2016 నుండి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

ఇంధన ధరలను సవరించిన తరువాత లీటర్ పెట్రోల్ ధర రూ. 56.61 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 46.43 లు గా ఉంది. అయితే పెంపుకు ముందు వీటి ధరలు లీటర్ పెట్రోల్ ధర రూ. 59.63 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 44.96 లుగా ఉండేవి.
మరింత చదవండి: పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు
చివరిగా గత ఫిబ్రవరి నెలలో ఇంధన ధరలను సవరించింది. అప్పుడు లీటర్ పెట్రోల్ మీద 32 పైసలు తగ్గింపు మరియు లీటర్ డీజల్ మీద 28 పైసలు చెప్పున పెంచింది.


Click it and Unblock the Notifications








