ఒకే కారు, ఒకే ఓనర్, ఒక మిలియన్ మైళ్లు నడిచిన కారు: ఇప్పటికీ నడుస్తోంది
కార్ల ప్రపంచంలో ఎవరూ బీట్ చేయలేని రికార్డ్; ఒక్క ఓనర్, ఒకే కారు 16 లక్షల కిమీలు...
ప్రపంచ కార్ల చరిత్రలో ఎవరూ బీట్ చేయలేని రికార్డ్ ను నమోదు చేసాడు ఒక వ్యక్తి. ఒకే కారు ఆ కారుకు ఒక్కడే ఓనరు, అతని చేతిలో వన్ మిలియన్ మైళ్లు (16 లక్షల కిలోమీటర్లు) తిరిగింది. మరి రికార్డే కదా...!

కారు డ్రైవింగ్ అనేది ఫ్యాషన్‌గా ఉన్నవాళ్లు లక్షల కిలోమీటర్ల నడపడం ఊహలకందని విషయం అని చెప్పవచ్చు. అయితే ఒక జెంటిల్ మ్యాన్ ఏకంగా ఒక మిలియన్ మైళ్ల (16 లక్షల కిమీలు) పాటు తన పోర్షే 356 కారును డ్రైవ్ చేసాడు.

ఇన్ని కిలోమీటర్లు కూడా ఒకే వ్యక్తి ఒకే కారుతో నడిపి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. తన చిన్న తనంలో డిగ్రీ పూర్తి చేసినందుకు ఇతని తండ్రి ఇతనికి పోర్షే 356 కారును ప్రెసెంట్ చేసాడు. ఇంతకూ ఇతని పేరు చెప్పలేదు కదూ, పేరు న్యూమార్క్.

తన తండ్రి నుండి గిఫ్ట్‌గా వచ్చిన కారును అమ్మేయకుండా ఈ వయస్సు వచ్చేదాకా దానినే వివియోగిస్తూ 16 లక్షల కిలోమీటర్లు నడిపాడు.

ఈ విషయం తెలుసుకున్న పోర్షే ప్రతినిధులు న్యూమార్క్ మరియు అతని కారుని కలిపి ఒక వీడియో తీసారు..
ఒక కారు, ఒకే ఓనర్ చేతిలో 16 లక్షల కిమీలు నడిచింది: వీడియోని వీక్షించగలరు.


Click it and Unblock the Notifications








