జెనీవా వేదిక మీద పోర్షే 718 బాక్ట్సర్
లగ్జరీ కార్లకు పుట్టినిల్లుగా ఉన్న పోర్షే సంస్థ ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న మోటార్ షోలో అత్యంత ఖరీదైన పోర్షే 718 బాక్ట్సర శ్రేణి కారును ప్రదర్శించింది. దీని ధర సుమారుగా 53,646 యూరోలుగా ఉండనుంది. అంటే మన రుపాయల్లో దీని విలువ 3,93,39,010 లు అన్నమాట. ఇంత ధరనా అని నోరెళ్లబెట్టేవారు ఉంటారు. కాని ధరకు తగ్గ ఫీచర్లు మా కారులో ఉన్నాయి అంటోంది పోర్షే. జెనీవా మోటార్ షో నుండి పోర్షే 718 బాక్ట్సర్ ఫోటోలు

ఇంజన్ మరియు ఇతర సాంకేతిక వివరాలు:
పోర్షే 718 బాక్ట్సర్ లో 2.0-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. అది దాదాపుగా 295 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్‌ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో కొత్తగా స్పోర్ట్ క్రోన్ ప్యాకేజ్ మరియు పిడికె డ్యూయల్ క్లచ్ గల గేర్ బాక్స్‌ను అందించారు. ఈ గేర్ బాక్స్ సహాయంతో ఇది కేవలం 4.7 సెకండ్ల కాలంలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 276 కిలోమీటర్లుగా ఉంది.
Also Read: పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు
పోర్షే ఈ 718 బాక్ట్సర్ కారును ఎస్ అనే వేరియంట్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది 2.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్‌ను కల్పించారు. ఇది సుమారుగా 345 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో కూడా 718 బాక్ట్సర్ లోని గేర్ బాక్స్‌ను కల్పించారు. ఇది కేవలం 4.2 సెకండ్ల కాలంలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని అత్యధిక వేగం గంటకు 285 కిలోమీటర్లుగా ఉంది.
అయితే రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌ను కలిగి ఉన్నాయి.
డిజైన్:
పోర్షే 718 బాక్ట్సర్ కారు ముందు వైపున పదునైన హెడ్ లైట్లను మరియు గాలిని లోనికి గ్రహించడానికి పెద్దగా డిజైన్ చేయబడిన లార్జ్ ఎయిర్ ఇంటేకర్ కలదు. వెనుక వైపున బూట్ స్పేస్‌కు ఇరువైపులా టెయిల్ లైట్లను ఎంతో చక్కగా డిజైన్ చేశారు. మరియు రెండు టెయిల్ పైపులను (పొగ గొట్టాలను) అలాగే రియర్ స్పాయిలర్‌ను కల్పించారు. తద్వారా వెనకునుండి కూడా దీనికి మరింత ఆకర్షణీమైన అందం వచ్చిందని చెప్పవచ్చు.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం
718 బాక్ట్సర్ ఇంటీరియర్ లోపల 918 ప్రేరణతో వచ్చిన స్టీరింగ్ వీల్ డిజైన్, కొత్తగా అభివృద్దిపరచబడిన ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ మరియు ఇది ఆపిల్ కార్ ప్లే, సిరి వాయిస్ కమాండ్లను సపోర్ట్ చేయగలదు.
పోటి మరియు అందుబాటులోకి:
పోర్షే వారి 718 బాక్ట్సర్ శ్రేణి కార్లు ఏప్రిల్ 30 నుండి యూరప్‌లో అమ్మకాలకు అందుబాటులోకి రానున్నాయి. పోర్షే వారి బాక్ట్సర్ ఎస్ కారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జాగ్వార్ ఎఫ్ టైపు కన్వర్టిబులు మరియు మెర్సిడెస్ బెంజ్ వారి ఎస్‌ఎల్‌సి కార్లకు పోటిగా నిలవనుంది.


Click it and Unblock the Notifications

































