దేశీయ మార్కెట్లోకి జూన్ 29న విడుదల కానున్న పోర్షే 911 కరేరా

By Anil

లగ్జరీ మరియు ఖరీదైన కార్ల తయారీ దిగ్గజం పోర్షే ఇండియన్ మార్కెట్లోకి 911 కరేరా 2016 ఎడిషన్ కారును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 29, 2016 న దేశీయ మార్కెట్లోకి ఈ కారును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిసింది. అయితే 2016 ఎడిషన్ 911 కరేరా ను మాత్రమేనా లేకపోతే 2016 ఎడిషన్ శ్రేణిలో ఉన్న అన్ని ఉత్పత్తులను విడుదల చేయనున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

పోర్షే 911 కరేరా 2016 ఎడిషన్-1

ఈ సరికొత్త 2016 ఎడిషన్ 9411 కరేరా కారులో 3.0 లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో ఛార్జ్‌డ్ ఇన్ లైన్ ఆరు సిలిండర్ల ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ సుమారుగా 370 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసేవిధంగా పోర్షే ఇంజనీర్లు రూపొందించారు. ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ మరియు టార్క్ 7-స్పీడ్ పిడికె ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రాలకు అందుతుంది.
పోర్షే 911 కరేరా 2016 ఎడిషన్-2

2016 ఎడిషన్ పోర్షే 911 కరేరా కారును పరిశీలిస్తే ముందు వైపున ఒకే తరహా పగటి పూట వెలిగే యూనిక్యు 4-పాయింట్ లైట్లు కలవు. అలాగే గుండ్రటి ఆకారంలో పెద్ద పరిమాణంలో ఉన్న హెడ్ ల్యాంప్స్ మరియు ఎక్కువ పరిమాణంలో గాలిని గ్రహించే లార్జ్ ఎయిర్ ఇంటేకర్ కలదు. నూతన టెయిల్ లైట్లుస బంపర్, స్పోర్టివ్ క్వాడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు నిలువు గీతల డిజైన్‌తో గల ఇంజన కవర్‌ కలదు.
శకుంతల రైల్వేస్: నేటికీ ఇండియన్ రైల్వేలో భాగం కాని ఏకైక రైలు సంస్థ
దేశీయంగా అందుబాటులోకి రానున్న 2016 ఎడిషన్ 911 కరేరా కారును కంప్లీట్లి బిల్ట్ యూనిట్‌గా దిగుమతి చేసుకోనున్నారు. దీని ధర సుమారుగా 1.5 కోట్లు ఎక్స్ షోరూమ్‌ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీని ధర మరియు పూర్తి సాంకేతిక వివరాలు జూన్ 29, 2016 న అధికారికంగా వెలివడనున్నాయి. అంత వరకు డ్రైవ్‌స్పార్క్‌ తెలుగుతో కలిసి ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, June 10, 2016, 12:57 [IST]
English summary
Porsche To Launch All-New 911 Carrera In India On June 29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+